Share News

Shaktikanta Das: త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:31 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు.

Shaktikanta Das: త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) ద్రవ్య విధాన ఫలితాలను శుక్రవారం ప్రకటించిన క్రమంలో UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గురించి కీలక ప్రకటన చేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు UPI చెల్లింపులు మరింత ఈజీగా మారనున్నాయని చెప్పారు. ఆ క్రమంలో UPI వినియోగదారులు త్వరలోనే నగదు డిపాజిట్ మెషీన్‌లో UPI ద్వారా తమ బ్యాంక్ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాతాదారులు డెబిట్ కార్డు ద్వారా మాత్రమే నగదు డిపాజిట్ మెషీన్‌లో డబ్బును డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది.


ఈ నిర్ణయం వల్ల కస్టమర్లకు పనులు మరింత సులభతరం కానున్నాయి. దీంతో బ్యాంకుల్లో కరెన్సీ(currency) నిర్వహణ ప్రక్రియ సమర్ధవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్(cash deposit) మెషీన్ల వినియోగం వల్ల ఖాతాదారుల సౌకర్యాలు పెరగనున్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఇంకోవైపు బ్యాంకు శాఖల్లో నగదు జమ చేసేందుకు ఒత్తిడి తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది. UPI ప్రజాదరణ, ఆమోదయోగ్యతను దృష్టిలో ఉంచుకుని, కార్డు లేకుండా నగదు డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందించాలని ప్రతిపాదించబడినట్లు వెల్లడించారు.


మరోవైపు బ్యాంక్ ఖాతాదారుల వంటి థర్డ్ పార్టీ UPI యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయడానికి PPIలు (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు) కార్డ్ హోల్డర్‌లను అనుమతించాలని కూడా ప్రతిపాదించబడిందన్నారు. ప్రస్తుతం PPI ద్వారా UPI చెల్లింపులు PPI కార్డ్ జారీచేసేవారు అందించిన వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేయవచ్చు. ఇది PPI కార్డ్ హోల్డర్లు బ్యాంక్ ఖాతాదారుల వలె UPI చెల్లింపులు చేయడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలో చిన్న మొత్తాల లావాదేవీలకు డిజిటల్ మార్గాలను సులభతరం చేస్తుంది. ఈ చర్యలకు సంబంధించి ఆర్‌బీఐ త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనుంది.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 04:35 PM