Share News

RBI: ఆర్బీఐ 5 అతిపెద్ద ప్రకటనలు.. సామాన్యులపై వీటి ప్రభావం ఎంత

ABN , Publish Date - Aug 08 , 2024 | 07:22 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు.

RBI: ఆర్బీఐ 5 అతిపెద్ద ప్రకటనలు.. సామాన్యులపై వీటి ప్రభావం ఎంత

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు. ఆర్‌బీఐ వరుసగా తొమ్మిదోసారి రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించింది. దీనికితోడు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అనేక కీలక అంశాలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం.

యూపీఐ లావాదేవీ పరిమితి పెంపు: పన్ను చెల్లింపుదారులు యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

చెక్కులు క్లియరెన్స్: చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా చెక్కుల చెల్లింపును వేగవంతం చేసే చర్యలను కూడా గవర్నర్ ప్రకటించారు. కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ద్వారా చెక్ క్లియరింగ్, బ్యాచ్-ప్రాసెసింగ్ మోడ్‌లో పనిచేస్తోంది.


రెపో రేటులో మార్పు లేదు: ఆర్‌బీఐ.. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునే కస్టమర్‌లకు వడ్డీ రేట్లలో ఎలాంటి ఉపశమనం లభించదు. అంటే అధిక రేట్లకే EMIలు చెల్లించాల్సి ఉంటుందనమాట.

రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మొత్తం ద్రవ్యోల్బణం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గవర్నర్ దాస్ పేర్కొన్నారు.

పెరుగుతున్న ఆహార ధరలు: పెరుగుతున్న ఆహార ధరలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, అధిక ఆహార ధరల ప్రభావాన్ని విస్మరించలేమని శక్తికాంత దాస్ తెలిపారు. ఆహార ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా సామాన్య పౌరులపై గణనీయంగా ప్రభావం చూపనున్నట్లు చెప్పారు.

Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం

Updated Date - Aug 08 , 2024 | 07:22 PM