సెబీ కొత్త ప్రతిపాదన
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:04 AM
లిస్టెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీహోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలకా్ట్రనిక్ విధానంలోనే నెరిపేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది.
ఇక ఎలక్ర్టానిక్ విధానంలోనే డివిడెండ్, వడ్డీ చెల్లింపులు!
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీహోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలకా్ట్రనిక్ విధానంలోనే నెరిపేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడంతో పాటు ఇన్వెస్టర్ల సొమ్ముకు భద్రత, సౌకర్యం పెంచే ఉద్దేశంతో సెబీ ఈ ప్రతిపాదన చేసింది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రాన్ని శుక్రవారం విడుదల చేసిన నియంత్రణ మండలి.. అక్టోబరు 11లో సలహాలు, సూచనలు పంపాలని ప్రజలను కోరింది. ప్రస్తుత లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్ (ఎల్‌ఓడీఆర్) నిబంధనలు కూడా ఎలకా్ట్రనిక్ చెల్లింపులను అనుమతిస్తాయి. కానీ, ఎలకా్ట్రనిక్ విధానంలో బదిలీ చేయలేని పక్షంలో రూ.1,500 పైగా సొమ్మును చెక్కు లేదా వారంట్ రూపంలో జారీ చేసేందుకూ వీలుంటుంది. సాధారణంగా సెక్యూరిటీ హోల్డర్ బ్యాంక్ ఖాతా వివరాలు అందుబాటులో లేకపోవడం లేదా తప్పులుంటే ఎలకా్ట్రనిక్ విధానంలో బదిలీ విఫలమతుంది. సెబీ తాజా డేటా ప్రకారం.. టాప్ 200 లిస్టెడ్ కంపెనీలకు చెందిన 1.29 శాతం ఎలకా్ట్రనిక్ డివిడెండ్ చెల్లింపులు ఫెయిలవుతున్నాయి. కాబట్టి, ఇన్వెస్టర్లు తమ బ్యాంక్ ఖాతా వివరాలను డిపాజిటరీల వద్ద అప్‌డేట్ చేసుకోవాలని సెబీ సూచించింది.
ఎంఎఫ్‌లు సీడీఎస్‌లు విక్రయించేందుకూ అనుమతి
క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్‌ల(సీడీఎస్) కొనుగోళ్లతో పాటు విక్రయాలు జరిపేందుకూ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎ్‌ఫ)కు సెబీ అనుమతిచ్చింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో ద్రవ్య లభ్యతను పెంచే ఉద్దేశంతో క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయ తీసుకుంది. ఈ వెసులుబాటు ఎంఎ్‌ఫలకు అదనపు పెట్టుబడి సాధనంగా ఉపయోగపడనుందని శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇప్పటివరకు కార్పొరేట్ బాండ్ల క్రెడిట్ రిస్క్‌కు రక్షణగా సీడీఎ్‌సల కొనుగోలుకు మాత్రమే ఫండ్లకు అనుమతి ఉండేది. సెబీ తాజా నిర్ణయంతో సీడీఎ్‌సల కొనుగోలు, విక్రయాలతో ఫండ్లకు కార్పొరేట్ బాండ్లపై క్రెడిట్ రిస్క్ నిర్వహణకు మరింత వెసులుబాటు లభించనుంది. రుణగ్రహీత (బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించిన కార్పొరేట్ కంపెనీ) దివాలా నుంచి రక్షణ కల్పించే బీమా కాంట్రాక్టే సీడీఎస్.