Stock Market: దేశీయ సూచీలకు స్వల్ప నష్టాలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:02 PM
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. ఈ వారంలో బుల్ జోరు చూపిన సెనెక్స్, నిఫ్టీ చివరి రోజు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
లాభాల జోష్‌లో పయనించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. ఈ వారంలో బుల్ జోరు చూపిన సెనెక్స్, నిఫ్టీ చివరి రోజు స్వల్ప నష్టాలను చవిచూశాయి. (Business News).
గురువారం ముగింపు (81, 765)తో పోల్చుకుంటే 100 కు పాయింట్లకు పైగా లాభంతో శుక్రవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభ నష్టాలతో దోబూచులాడింది. ఉదయం నష్టాల్లోకి జారుకుని 81, 506 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆర్బీఐ మీటింగ్ తర్వాత తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. ఇంట్రాడే కనిష్టం నుంచి 400 పాయింట్లకు పైగా లాభపడి 81, 925 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 56 పాయింట్ల స్వల్ప నష్టంతో 81, 709 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 20 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. చివరకు 30 పాయింట్ల నష్టంతో 24, 677 వద్ధ స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, పీబీ ఫిన్‌టెక్, వేదాంత, డెలివరీ షేర్లు లాభాలు అందుకున్నాయి. కాన్ ఫిన్ హోమ్స్, కామ్స్, ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్సియల్, ఆల్కెమ్ ల్యాబ్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 263 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.69గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..