Share News

Stock Market: దేశీయ సూచీలకు నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:20 PM

ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. ఐటీ రంగం మినహా మిగిలిన రంగాలపై మదపుర్లు దృష్టి సారించలేదు. దీంతో దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు.

Stock Market: దేశీయ సూచీలకు నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా మన దేశ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. ఐటీ రంగం మినహా మిగిలిన రంగాలపై మదపుర్లు దృష్టి సారించలేదు. దీంతో దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు. నవంబర్ నెల రిటైల్ గణాంకాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. (Business News).


బుధవారం ముగింపు (81, 526)తో పోల్చుకుంటే దాదాపు 50 పాయింట్ల నష్టంతో గురువారం ఉదయం మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభ నష్టాలతో దోబూచులాడింది. ఉదయం లాభాల్లో కొనసాగి 81, 680 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 81, 211 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 236 పాయింట్ల నష్టంతో 81, 289 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 93 పాయింట్ల నష్టంతో 24, 548 వద్ధ స్థిరపడింది. 24, 550కు దిగువన రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, మ్యాక్స్ హెల్త్‌కేర్, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. నేషనల్ అల్యూమినియం, జుబిలెంట్ ఫుడ్స్, ఇండస్ టవర్స్, సింజిన్ ఇంటెల్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 271 పాయింట్ల నష్టంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.86గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 04:20 PM