Share News

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:05 PM

గతవారం భారీ నష్టాలకు సోమవారం బ్రేకులు వేసి లాభాల బాట పట్టిన దేశీయ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు రాణించినప్పటికీ, మెటల్ స్టాక్స్ నష్టాల్లో ఉండడంతో సెన్సెక్స్‌ ఒడిదుడుకులు ఎదుర్కొంది.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

గతవారం భారీ నష్టాలకు సోమవారం బ్రేకులు వేసి లాభాల బాట పట్టిన దేశీయ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు రాణించినప్పటికీ, మెటల్ స్టాక్స్ నష్టాల్లో ఉండడంతో సెన్సెక్స్‌ ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలను ఆర్జించింది. (Business News).


సోమవారం ముగింపు (78, 540)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ కొద్దిసేపటికే నష్టాలోకి జారుకుంది. 150 పాయంట్లకు పైగా నష్టపోయి 78, 397 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చి ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడి 78, 877 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో కాస్త ఒడిదుడుకులకు లోనైంది. చివరకు 67 పాయింట్ల స్వల్ప నష్టంతో 78, 472 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 15 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. చివరకు 25 పాయింట్ల నష్టంతో 23, 727 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఆర్బీఎల్ బ్యాంక్, బయోకాన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హిందుస్తాన్ కాపర్, టాటా కెమికల్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. పీబీ ఫిన్‌టెక్, మాక్రోటెక్ డెవలపర్స్, సైమన్స్, దాల్మియా భారత్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 35 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.20గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2024 | 04:05 PM