Stock Market: రెండో రోజూ లాభాలే.. రాణించిన బ్యాకింగ్ షేర్లు..
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:07 PM
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల జోష్‌లో పయనించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసివచ్చింది. ఉదయం నష్టాల్లో కదలాడిన మార్కెట్లకు మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల అండ లభించింది. దీంతో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ముగిశాయి.
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల జోష్‌లో పయనించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసి వచ్చింది. ఉదయం నష్టాల్లో కదలాడిన మార్కెట్లకు మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల అండ లభించింది. దీంతో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ముగిశాయి. గత వారం 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ సోమ, మంగళవారాల్లో కోలుకుంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించి లాభాలు అందుకుంది (Business News).
సోమవారం ముగింపు (80, 005)తో పోల్చుకుంటే 80, 037 వద్ద మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 79, 421 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం వరకు నష్టాలోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో లాభాల బాట పట్టింది. ఇంట్రాడే లో నుంచి దాదాపు 1000 పాయింట్లు లాభపడి 80, 450 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 363 పాయింట్ల లాభంతో 80, 369 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 127 పాయింట్ల లాభంతో 24, 446 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలు అందుకున్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. వమిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు 514 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 1061 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..