Share News

Stock Market: మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. 80 వేల దిగువకు సెన్సెక్స్..

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:58 PM

వరుసగా రెండో రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లకు రోజంతా ఆదే ధోరణిలో కొనసాగాయి.

Stock Market: మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. 80 వేల దిగువకు సెన్సెక్స్..
Stock Market

వరుసగా రెండో రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా ఆదే ధోరణిలో కొనసాగాయి. దీంతో వరుసగా రెండో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో కాస్త కోలుకున్న సెన్సెక్స్ బుధవారం నష్టాలతో తిరిగి 80 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించి నష్టాలను మూటగట్టుకుంది (Business News).


మంగళవారం ముగింపు (80, 369)తో పోల్చుకుంటే దాదాపు 140 పాయింట్ల నష్టంతో 80, 237 వద్ద బుధవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 79, 821 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ 79, 821 - 80, 435 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 426 పాయింట్ల నష్టంతో 79, 942 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 126 పాయింట్ల నష్టంతో 24, 340 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఏబీ క్యాపిటల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మారికో, మనప్పురం ఫైనాన్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. ఎమ్‌సీఎక్స్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, వోల్టాస్, సిప్లా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు 87 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 30 , 2024 | 03:58 PM