Share News

Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. లాభాల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:38 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళి దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూలం ప్రభావం చూపుతోంది. దీంతో వరుసగా నష్టాలు చవి చూస్తున్న దేశీయ సూచీలు కోలుకుంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. బుధవారం కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. లాభాల్లో దేశీయ సూచీలు..
Stock Market

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళి దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూలం ప్రభావం చూపుతోంది. దీంతో వరుసగా నష్టాలు చవి చూస్తున్న దేశీయ సూచీలు కోలుకుంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. బుధవారం కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల బాటలో పయనించి 80 వేల మార్క్‌ను కూడా దాటింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాల్లో కదలాడుతోంది (Business News).


మంగళవారం ముగింపు (79, 476)తో పోల్చుకుంటే 300 పాయింట్ల లాభంతో 79, 771 వద్ద బుధవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో మూడు వంద పాయింట్లు లాభపడి 80 వేల మార్క్‌ను దాటింది. 80, 115 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 79, 751 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా లాభపడి 24, 400 మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం 92 పాయింట్ల లాభంతో 24, 305 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో డిక్సన్ టెక్నాలజీస్, ఐఆర్‌సీటీసీ, మహానగర్ గ్యాస్, పాలీక్యాబ్ షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. టైటాన్ కంపెనీ, మనప్పురం ఫైనాన్స్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 521 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 47 పాయింట్ల లాభంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.19గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 06 , 2024 | 10:38 AM