Stock Market: వరుస నష్టాల నుంచి తేరుకున్న సూచీలు.. మళ్లీ 25 వేల ఎగువకు నిఫ్టీ..
ABN , Publish Date - Oct 08 , 2024 | 04:15 PM
వరుసగా ఆరు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. భారీ నష్టల నుంచి దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాటలో సాగిన సంగతి తెలిసిందే.
వరుసగా ఆరు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. భారీ నష్టల నుంచి దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా గత వారం దేశీయ సూచీలు నష్టాల బాటలో సాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువడిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం, కనిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలు సాగించడం వంటి కారణాలతో దేశీయ సూచీలు లాభాలు దక్కించుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. (Business News).
సోమవారం ముగింపు (81, 050)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 80, 826 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 80, 813 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకి అక్కడి నుంచి దాదాపు 900 పాయింట్లకు పైగా లాభపడి 81, 763 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. చివరకు 584 పాయింట్ల లాభంతో 81, 634 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 217 పాయింట్ల లాభంతో 25, 013 వద్ద స్థిరపడింది. మళ్లీ 25 వేలకు ఎగువన రోజును ముగించింది.
బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడి కానున్న నేపథ్యంలో మదుపర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తుస్నారు. సెన్సెక్స్‌లో ట్రెంట్, డిక్సన్ టెక్నాలజీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇండియా మార్ట్ లాభాల బాటలో పయనించాయి. ఎన్‌ఎమ్‌డీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా నష్టాలను చవిచూస్తూ వస్తున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు 1235 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 542 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
అమ్మకానికి హైడెల్‌బర్గ్ సిమెంట్!
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..