Share News

Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు.. అదానీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి..

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:58 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. మరోవైపు పలు ఏజెన్సీల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న అదానీ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా అదానీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు.. అదానీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి..
Stock Market

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నాటి నుంచి బుల్ జోష్‌తో సాగిన మార్కెట్లు మంగళవారం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. మరోవైపు పలు ఏజెన్సీల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న అదానీ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా అదానీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. ఒక దశలో 80 వేల దిగువకు కూడా పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ తరహాలోనే లాభాల నుంచి నష్టాల వైపు పయనించింది. (Business News).


సోమవారం ముగింపు (80, 109)తో పోల్చుకుంటే దాదాపు 300 పాయింట్ల లాభంతో 80, 415 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మెల్లిగా నష్టాల్లోకి జారుకుంది. 80, 482 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకున్న సెన్సెక్స్ క్రమంగా దిగి వచ్చింది. ఇంట్రాడే గరిష్టం నుంచి ఒక దశలో ఏకంగా 600 పాయింట్లు కోల్పోయి 79, 798 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 105 పాయింట్ల నష్టంతో 80, 004 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 120 పాయింట్ల లాభంతో 24, 343 వద్ద ప్రారంభమై నష్టాల్లోకి జారుకుంది. చివరకు 27 పాయింట్ల నష్టంతో 24, 194 వద్ధ స్థిరపడింది.


సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, బయోకాన్, బిర్లా సాఫ్ట్ షేర్లు లాభాలు అందుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, లూపిన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 13 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.33గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2024 | 03:58 PM