Stock Market: దేశీయ సూచీలకు లాభాల జోరు.. భారీ లాభాల్లో అదానీ షేర్లు..
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:57 PM
కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ భారీ నష్టాలను చవిచూసిన అదానీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అదానీకి చెందిన చాలా సంస్థల షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల విలువ 90 వేల కోట్లకు పైగా పెరిగింది. అదానీ షేర్లు రాణింపుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి
దేశీయ సూచీలు బుధవారం లాభాల బాటలో పయనించాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొని లాభాల్లోనే రోజును ముగించాయి. మరోవైపు కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ భారీ నష్టాలను చవిచూసిన అదానీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. అదానీకి చెందిన చాలా సంస్థల షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల విలువ 90 వేల కోట్లకు పైగా పెరిగింది. అదానీ షేర్లు రాణింపుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు అందుకున్నాయి (Business News).
మంగళవారం ముగింపు (80, 0049)తో పోల్చుకుంటే 100 పాయింట్లకు పైగా లాభంతో 80, 121 వద్ద బుధవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్తా ఒడిదుడుకులను ఎదుర్కొంది. మధ్యాహ్నం వరకు లాభనష్టాలతో దోబూచులాడింది. 79, 844 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అలాగే ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభపడి 80, 511 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 230 పాయింట్ల లాభంతో 80, 234 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 80 పాయింట్ల లాభంతో 24, 274 వద్ధ స్థిరపడింది.
సెన్సెక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, వొడాఫోన్ ఐడియా, అదానీ పోర్ట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు అందుకున్నాయి. ఇప్కా ల్యాబ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, డాక్టర్ లాల్‌పాథ్ ల్యాబ్స్, గ్యాన్సుయల్స్ ఇండియా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 357 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.45గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..