Share News

Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి.. అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:06 AM

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి.

Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి.. అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు..
Stock Market

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఒక దశలో భారీగా పతనమై ప్రస్తుతం కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. (Business News).


సోమవారం ముగింపు (81, 973)తో పోల్చుకుంటే స్వల్ప లాభంతో 82, 101 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా లాభాల్లోకి దూసుకెళ్లింది. 330 పాయింట్లకు పైగా లాభపడి 82, 300 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ దశలో అమ్మకాలు మొదలు కావడంతో నష్టాల బాట పట్టింది. గరిష్టం నుంచి ఏకంగా 600 పాయింట్లకు పైగా కోల్పోయి 81, 636 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:57 గంటలకు 132 పాయింట్ల నష్టంతో 81, 843 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 50 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించి నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 58 పాయింట్ల నష్టంతో 25, 069 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో హిందుస్తాన్ పెట్రో, మహానగర్ గ్యాస్, బలరామ్‌పూర్ చిన్నీ, బర్గర్ పెయింట్స్ లాభాల బాటలో ఉన్నాయి. ఐఈఎక్స్, బంధన్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 40 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 11:06 AM