Share News

Stock Market: స్వల్ప నష్టాలతో మొదలైన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Dec 16 , 2024 | 10:03 AM

మార్కెట్లకు ఉత్సాహం కలిగించే వార్తలు కూడా లేకపోవడం‌తో స్టాక్ మార్కెట్లు డల్‌గా ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం రాణిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతోనూ, 13 పాయింట్ల నష్టంతోనూ ప్రారంభమయ్యాయి.

Stock Market: స్వల్ప నష్టాలతో మొదలైన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మన దేశ మార్కెట్లు స్వల్ప నష్టాలతో రోజును ప్రారంభించాయి. అలాగే మార్కెట్లకు ఉత్సాహం కలిగించే వార్తలు కూడా లేకపోవడం‌తో స్టాక్ మార్కెట్లు డల్‌గా ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం రాణిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతోనూ, 13 పాయింట్ల నష్టంతోనూ ప్రారంభమయ్యాయి. (Business News).


శుక్రవారం ముగింపు (82, 133)తో పోల్చుకుంటే దాదాపు 130 పాయింట్ల నష్టంతో సోమవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ స్థబ్ధుగా కొనసాగుతోంది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే దాదాపు 400 పాయింట్లు కోల్పోయి 81, 814 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మళ్లీ త్వరగానే కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయానికి 130 పాయింట్ల నష్టంతో 81, 997 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 35 పాయింట్ల నష్టంతో 24, 733 వద్ధ కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో మనప్పురం ఫైనాన్స్, ప్రెస్టిజ్ ఎస్టేట్, మార్కోటెక్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాలు అందుకున్నాయి. ఏంజెల్ వన్, జిందాల్ స్టీల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, వేదాంత షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 306 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.83గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 16 , 2024 | 10:03 AM