Share News

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల బాటలో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Sep 04 , 2024 | 09:59 AM

వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతలు, ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలు మూటగట్టుకున్నాయి.

Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల బాటలో దేశీయ సూచీలు..
Stock Market

వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పలు ఉద్రిక్తతలు, ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆ ప్రభావం నేడు ఆసియా సూచీల పైనా పడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతోనూ, నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతోనూ కొనసాగుతున్నాయి (Business News).


మంగళవారం ముగింపు (82, 555)తో పోల్చుకుంటే దాదాపు 700 పాయింట్ల నష్టంతో 81, 845 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతం 9:50 గంటల సమయంలో 516 పాయింట్ల నష్టంతో 82, 038 వద్ద ట్రేడ్ అవుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. దాదాపు 200 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 9:50 గంటల సమయంలో 154 పాయింట్ల నష్టంతో 25, 124 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో ఆసియన్ పెయింట్స్, హిందుస్తాన్ పెట్రోలియం, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, బలరామ్‌పూర్ చిన్నీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎంఫసిస్, కోల్ ఇండియా, కోఫోర్జ్ లిమిటెడ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 150 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.95గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Gold Prices: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. మీ ప్రాంతంలో ఎంతంటే


రికార్డుల ర్యాలీకి విరామం


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 09:59 AM