Share News

Stock Market: నిఫ్టీ ఆల్ టైమ్ హై.. స్వల్ప లాభాలతో రోజును ముగించిన దేశీయ సూచీలు..!

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:59 PM

అంతర్జాతీయంగా నెలకొన్న పలు ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు అనిశ్చిత్తిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకుంటున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గానే రోజును ముగించాయి.

Stock Market: నిఫ్టీ ఆల్ టైమ్ హై.. స్వల్ప లాభాలతో రోజును ముగించిన దేశీయ సూచీలు..!
Stock Market

అంతర్జాతీయంగా నెలకొన్న పలు ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు అనిశ్చిత్తిలో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకుంటున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గానే రోజును ముగించాయి. ఒక దశలో 82 వేల మార్క్‌ను దాటిని సెన్సెక్స్ మళ్లీ కిందకు దిగి వచ్చింది. నిఫ్టీ ఆల్‌టైమ్ హైని టచ్ చేసింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ కిందకు దిగి వచ్చాయి. (Business News).


మంగళవారం ముగింపు (81, 711)తో పోల్చుకుంటే దాదాపు 70 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. ఒక దశలో దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి 82 ,039 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. 82 వేల మార్క్‌ను దాటింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో నష్టాల్లోకి జారిపోయింది. 81, 578 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 73 పాయింట్ల లాభంతో 81, 785 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 25,129 వద్ద జీవన కాల గరిష్టాన్ని తాకింది. చివరకు 34 పాయింట్ల లాభంతో 25,052 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ట్రెంట్, గ్యాన్యుయల్స్ ఇండియా, ఐఈఎక్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, బందన్ బ్యాంక్, మారికో, బర్గర్ పెయింట్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 73 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.95గా ఉంది.

ఇవి కూడా చదవండి..

SBI: తొలి త్రైమాసికం ఆశాజనకంగా లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ అంచనా


Gold Price: మహిళలకు శుభ వార్త.. తగ్గిన బంగారం ధరలు


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 03:59 PM