Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. భారీగా లాభపడిన బ్యాంక్ నిఫ్టీ !
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:05 PM
వరుస లాభాలు అందుకుంటూ సరికొత్త గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలు బుధవారం కాస్త ఒడిదుడులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి.
వరుస లాభాలు అందుకుంటూ సరికొత్త గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలు బుధవారం కాస్త ఒడిదుడులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బ్యాంక్ నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించింది. సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయింది (Business News).
మంగళవారం ముగింపు (77, 301)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 77,543 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉయదం లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 500 పాయింట్లు లాభపడి 77,851 వద్ద ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఇంట్రాడే హై నుంచి ఒక దశలో ఏకంగా 900 పాయింట్లు కోల్పోయింది. చివరకు 36 పాయింట్ల స్వల్ప లాభంతో 77, 337 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 23,516 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఛంబల్ ఫెర్టిలైజర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోరమండల్ షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వోల్టాస్, గుజరాత్ గ్యాస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లకు డిమాండ్ ఏర్పడడంతో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 957 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 536 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.45గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ITR Filling: ఐటీఆర్ ఫాం 16 ఎలా సమర్పించాలి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Stock Market Updates: బీఎస్ఈలో సరికొత్త రికార్డులకు బెంచ్‌మార్క్ సూచీలు..త్వరలో ఇంకా పెరుగుతుందా..?
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..