Stock Market: మరోసారి రికార్డు స్థాయికి దూసుకెళ్లిన సెన్సెక్స్.. 620 పాయింట్లు లాభం..!
ABN , Publish Date - Jul 12 , 2024 | 03:59 PM
గరిష్టాల వద్ద ఎదురైన అమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్న దేశీయ సూచీలు శుక్రవారం మరింత ఎత్తులకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో కాస్త కన్సాలిడేట్ అయిన సూచీలు శుక్రవారం రికార్డుల దిశగా దూసుకుపోయాయి.
గరిష్టాల వద్ద ఎదురైన అమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్న దేశీయ సూచీలు శుక్రవారం మరింత ఎత్తులకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో కాస్త కన్సాలిడేట్ అయిన సూచీలు శుక్రవారం రికార్డుల దిశగా దూసుకుపోయాయి. ఈ దెబ్బకు సెన్సెక్స్ మళ్లీ 80 వేల ఎగువకు రావడమే కాకుండా లైఫ్ టైమ్ హైని చేరుకుంది. చివరకు 620 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా భారీ లాభాలను ఆర్జించింది. (Business News).
గురువారం ముగింపు (79, 897)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ లాభాల దిశగా దూసుకుపోయింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడి 80, 893 వద్ద జీవన కాల గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత మెల్లిగా దిగివచ్చింది. చివరకు 622 పాయింట్ల లాభంతో80, 519 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. 24, 592 వద్ద లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. చివరకు 186 పాయింట్ల లాభపడి 24,502 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో కోఫోర్జ్ ఇండియా, టీసీఎస్, మనప్పురం ఫైనాన్స్, బిర్లా సాఫ్ట్ షేర్లు లాభపడ్డాయి. ఇండియన్ ఆయిల్, ఏబీబీ ఇండియా, వోడాఫోన్ ఐడియా, పవర్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 25 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 8 పాయింట్లు ఆర్జించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.54గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Anant Ambani: అనంత్ అంబానీ కుర్తాపై ఎమరాల్డ్ డైమండ్.. ధర ఎంతో తెలుసా..
Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..