Share News

Stock Market: వరుస నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 870 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..!

ABN , Publish Date - Aug 07 , 2024 | 04:13 PM

గత రెండ్రోజులు భారీ నష్టాలను చవి చూసి డీలా పడిన సూచీలు బుధవారం కోలుకున్నాయి. జపాన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి పాజిటివ్ స్టేట్‌మెంట్లు రావడంతో బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Stock Market: వరుస నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 870 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..!
Stock Market

గత రెండ్రోజులు భారీ నష్టాలను చవి చూసి డీలా పడిన సూచీలు బుధవారం కోలుకున్నాయి. జపాన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి పాజిటివ్ స్టేట్‌మెంట్లు రావడంతో బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. రోజంతా అదే జోరును చూపించాయి. సెన్సెక్స్ 870 పాయింట్లు లాభపడి 79 వేలకు పైన రోజును ముగించింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించి లాభాలు అందుకుంది. (Business News).


మంగళవారం ముగింపు (78, 593)తో పోల్చుకుంటే దాదాపు 1000 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 79, 639 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. బుధవారం 79, 106- 79, 639 మధ్య సెన్సెక్స్ కదలాడింది. చివరకు 874 పాయింట్ల లాభంతో 79,468 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. మళ్లీ 24 వేల మార్కును దాటింది. చివరకు 304 పాయింట్ల లాభంతో 24, 297 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ, కమిన్స్, కోల్ ఇండియా, భెల్ షేర్లు లాభాలు ఆర్జించాయి. శ్రీ సిమెంట్స్, బాటా ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1358 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 370 పాయింట్లు ఆర్జించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Interest Rates: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను భారీగా పెంచిన కీలక బ్యాంకులు


Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2024 | 04:13 PM