Stock Market: రాణిస్తున్న దేశీయ సూచీలు.. వరుసగా మూడో రోజూ లాభాలే..!
ABN , Publish Date - Apr 23 , 2024 | 04:32 PM
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడం సూచీలకు కలిసి వస్తోంది.. ఈ రోజు ఉదయం నుంచి దేశీయ సూచీలు లాభాల్లోనే కదలాడాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడం సూచీలకు కలిసి వస్తోంది.. ఈ రోజు ఉదయం నుంచి దేశీయ సూచీలు లాభాల్లోనే కదలాడాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ మోస్తరు లాభాలతో సరిపెట్టుకున్నాయి (Business News).
మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ జోరు మధ్యాహ్నం తర్వాత కొంత తగ్గింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగిడంతో లాభాలను కోల్పోయింది. చివరకు 89 పాయింట్ల లాభంతో 74,048 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22, 368వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 484 పాయింట్లు ఎగబాకింది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, వోడాఫోన్ ఐడియా లాభాలను ఆర్జించాయి. సన్‌ఫార్మా, రిలయన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.33గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Business Idea: ఉద్యోగం వదిలి పశుపోషణ.. నెలకు లక్షకుపైగా ఆదాయం
Gold and Silver Price: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..