Stock Market: ఫెడ్ సమావేశం ముంగిట అప్రమత్తత.. నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Sep 18 , 2024 | 03:59 PM
మరికొద్ది గంటల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ అధ్యక్షుడు జొరెమ్ పావెల్ మీడియా ముందుకు రాబోతున్నారు. వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఫెడ్ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని మార్కెట్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు.
మరికొద్ది గంటల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ అధ్యక్షుడు జొరెమ్ పావెల్ మీడియా ముందుకు రాబోతున్నారు. వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఫెడ్ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని మార్కెట్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీలు కూడా నష్టాల్లోనే పయనించాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి (Business News).
మంగళవారం ముగింపు (83, 079)తో పోల్చుకుంటే స్వల్ప నష్టంతో 83, 037 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా కోల్పోయి 82, 700 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ 82, 700-83, 326 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 131 పాయింట్ల నష్టంతో 82, 9489 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. దాదాపు 41 పాయింట్ల నష్టంతో 25, 377 వద్ద స్థిరపడింది. మళ్లీ 25, 400 దిగువకు వచ్చింది.
సెన్సెక్స్‌లో మదర్సన్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐఈఎక్స్ షేర్ల లాభాలు సంపాదించాయి. ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, ఎంఫసిస్, గ్లెన్‌మార్క్, అబాట్ ఇండియా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 427 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం రోజంతా లాభాల్లోనే సాగింది. 561 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.75గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Jio: జియో దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాదిపాటు ఇంటర్‌నెట్ ఫ్రీ
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..