Stock Market: స్వల్ప నష్టాల్లో సూచీలు.. అప్రమత్తంగా నిఫ్టీ, సెన్సెక్స్..!
ABN , Publish Date - Aug 13 , 2024 | 10:11 AM
అదానీ గ్రూప్‌తో సెబీ ఛైర్‌పర్సన్ మాధవి బచ్‌కు ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ చేసిన సంచలన ఆరోపణలు మదుపర్లకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి.
అదానీ గ్రూప్‌తో సెబీ ఛైర్‌పర్సన్ మాధవి బచ్‌కు ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ చేసిన సంచలన ఆరోపణలు మదుపర్లకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అదానీ కంపెనీల షేర్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. (Business News).
సోమవారం ముగింపు (79, 648)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 90 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 10 గంటల సమయంలో 80 పాయింట్ల నష్టంతో 79, 570 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో 50 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే అప్రమత్తంగా కదలాడుతోంది. ఉదయం 10 గంటల సమయంలో 12.90 పాయింట్ల నష్టంతో 24, 334 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్‌లో హిందుస్తాన్ కాఫర్, డిక్సన్ టెక్నాలజీస్, మారికో, అరబిందో ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్, ఒబెరాయ్ రియాలిటీ, దీపక్ నైట్రేట్, సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 199 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.
ఇవి కూడా చదవండి..
బీటీ గ్రూప్‌లో భారతికి 24.5% వాటా
సెబీ చీఫ్‌పై మా ఆరోపణలు పక్కా నిజం
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..