Business Idea: సమ్మర్‌లో తక్కువ పెట్టుబడితో బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం
ABN , Publish Date - Feb 23 , 2024 | 01:50 PM
సమ్మర్ టైం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సీజన్లో చేసే ఒక మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
సమ్మర్ టైం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సీజన్లో చేసే ఒక మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్లు(coolers) ఉంటాయి. అయితే లేని వారు కొత్తవి లేదా పాడైన పాత కూలర్లకు బదులు మరొకటి తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు ప్రైవేటు బస్సులు, వాహానాల్లో కూడా చిన్న చిన్న కూలర్లను అనేక మంది ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కూలర్ల తయారీ వ్యాపారం చేయడం ద్వారా ఈ సీజన్లో తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఎలా ప్రారంభించాలి, ఏం పరికరాలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
పెట్టుబడి ఎంత, ఏం కావాలి ?
ఈ వ్యాపారం ప్రారంభించాలంటే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీకు చాలా ముడి పదార్థాలు అవసరమవుతాయి. వాటిలో ఐరన్, తీగ, ఇనుము కట్టింగ్ యంత్రం, పెయింట్, కూలర్ ఫ్యాన్, మోటార్, నీటి మోటార్, నట్ బోల్టులు, ఉన్ని గడ్డి వంటివి ఉన్నాయి.
ఎలా తయారు చేయాలి
మొదట కూలర్ చేయడానికి మీరు ప్రాథమికంగా జ్ఞానం(Business Idea) కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఎవరిదగ్గరైనా నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ సైజ్ కూలర్‌ను తయారు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత కూలర్‌కు ఫ్యాన్ ఉన్న ముందు భాగం తయారు చేయాలి. దీనిని చేయడానికి ఇనుప షీట్‌ను గుండ్రంగా కత్తిరించాలి. ఆ తర్వాత మీరు మొదట వెల్డింగ్ ద్వారా కూలర్ ఫ్యాన్, మోటారును అమర్చాలి. దీని తరువాత మీరు కూలర్ వైపులా 3 మెష్‌లను తయారు చేయాలి. దీని కోసం మీరు నెట్‌ను తయారు చేసి ఉన్ని గడ్డితో నింపాలి. గడ్డిని నీటిలో నానబెట్టాలని గుర్తుంచుకోండి.
దీని తరువాత మీరు బోల్టులను సరిపోయేలా ఫిట్ చేసి, ముందు వైపున మూడు బటన్‌లను ఏర్పాటు చేయాలి. బటన్ల తర్వాత మీరు ఎగువ టబ్, టబ్ నుంచి నీరు నెట్‌లోకి వెళ్లే విధంగా కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మీ కూలర్ సిద్ధంగా ఉంటుంది. అప్పుడు దానికి మంచి రంగును వేయాలి. కనీసం 10 లీటర్ల పరిమాణంలో కూలర్‌ను తయారు చేయాలి. దీన్ని మార్కెట్ చేయడానికి మీ కూలర్ బ్రాండ్‌కు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని మొదట ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు.
ఎంత లాభం
ఈ కూలర్ వ్యాపారంలో కూలర్లను మీరే తయారు చేసి విక్రయిస్తే ప్రస్తుతం ప్రతి కూలర్ 5 నుంచి 6 వేల రూపాయలకు అమ్ముకోవచ్చు. మీడియం సైజ్ కూలర్ అయితే 3 నుంచి 4 వేల రూపాయలకు సేల్ చేయవచ్చు. ఇలా రోజుకు 10 కూలర్ల చొప్పున తయారు చేసుకుని నెలకు 300 అమ్ముకుంటే ప్రతి దానిపై సుమారు వెయ్యి రూపాయల లాభం వెసుకున్నా కూడా నెలకు మూడు లక్షల రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. కావాలంటే స్వయంగా తయారు చేసిన కూలర్‌ను ఏ డీలర్లకైనా విక్రయించుకోవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..