Share News

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:50 PM

అక్టోబర్ నెల రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. వీటిలో ఎల్‌పీజీ ధరల మార్పులు సహా అనేకం ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
new rules from October 1st

ప్రతి నెలా మొదటి తేదీన కొన్ని మార్పులు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటిలో ఎల్‌పీజీ ధరల మార్పులు సహా అనేక రూల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారనున్న నిబంధనలు, రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్ కార్డు

పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ID ఇకపై ఉపయోగించబడదు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డుల దుర్వినియోగం, నకిలీలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


సుకన్య సమృద్ధి యోజన

కుమార్తెల ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన స్కీంలో ముఖ్యమైన మార్పు జరుగుతోంది. అక్టోబర్ 1, 2024 నుంచి కుమార్తెల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఈ ఖాతాలను నిర్వహించగలరు. ఈ కొత్త రూల్ ప్రకారం SSY ఖాతాను కూతురికి చట్టపరమైన సంరక్షకుడు కానీ వ్యక్తి తెరిచి ఉంటే ఆ ఖాతాను ఆమె బయోలాజికల్ పేరెంట్ లేదా లీగల్ గార్డియన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే ఖాతా రద్దవుతుంది. ఈ మార్పు ఉద్దేశ్యం పిల్లల ఆర్థిక వ్యవహారాలపై చట్టపరమైన అధికారం ఉన్న వారిచే ఖాతా నిర్వహించబడుతుందని నిర్ధారించడం.


సబ్సిడీ

అక్టోబర్ 1, 2024 నుంచి ప్రధానమంత్రి ఇ డ్రైవ్ యోజన స్కీం అమల్లోకి రానుంది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి రూ.50 వేల వరకు సబ్సిడీ లభించనుంది.

మారనున్న రేట్లు

అక్టోబర్ 1, 2024 నుంచి స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రెడింగ్ చేసే లావాదేవీలపై పన్ను పెరుగుతుంది

ఆస్తి అమ్మితే

స్థిరాస్తి విక్రయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనలను మార్చింది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి ఎవరైనా రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని అమ్మితే దానిపై 1 శాతం టీడీఎస్ చెల్లించాలి.


పీపీఎఫ్ రేట్లు

పీపీఎఫ్ ఖాతాల్లో కూడా మార్పులు కూడా అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. మైనర్ అకౌంట్ల వడ్డీ రేట్లు పోస్టాఫీస్ సేవింగ్ బ్యాంక్ రేట్లకు అనుగూణంగా ఉంటాయి. మైనర్లు మేజర్లు అయిన తర్వాత మాత్రమే సాధారణ పీపీఎఫ్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.


కనీస వేతనాలు

అక్టోబర్ 1 నుంచి కార్మికులకు పెరిగిన వేతనాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ.1035కు పెంచింది. నిర్మాణ, క్లీనింగ్, లోడింగ్, అన్‌లోడ్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.783 లభిస్తుంది. సెమీ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.868. నైపుణ్యం, క్లరికల్, వాచ్‌మెన్ లేదా గార్డులకు కనీస వేతనం రోజుకు రూ.954. చౌకీదారి లేదా గార్డు పని చేసే వారికి కనీస వేతనం రోజుకు రూ.1035.


LPG ధర

ప్రతి నెలా మొదటి తేదీన, చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను మారుస్తాయి. అక్టోబర్ 2024 కొత్త రేట్లు అక్టోబర్ 1 ఉదయం 6 గంటల తర్వాత మారుతాయి. ఇటీవల 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో తరచూ మార్పులు జరుగుతుండగా, 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కొంతకాలంగా స్థిరంగా ఉంది. దీపావళి వస్తున్న నేపథ్యంలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

PM E DRIVE: ఈవీలు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి రూ. 50 వేల వరకు తగ్గింపు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు


Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 30 , 2024 | 05:52 PM