Share News

Pregnant Womens: ఈ పథకాలు గర్భిణులకు ఎంతో ఉపయోగం.. ప్రసవానంతరం ఆర్థిక సాయం

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:37 PM

దేశంలో ప్రజలందరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానంగా మహిళలు(womens), కుమార్తెల కోసం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈ పథకాల కింద మహిళలకు అనేక రకాల సహాయాలు అందించబడుతున్నాయి. వీటిలో గర్భిణీ స్త్రీల(pregnant womens) కోసం ఉపయోగపడే పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Pregnant Womens: ఈ పథకాలు గర్భిణులకు ఎంతో ఉపయోగం.. ప్రసవానంతరం ఆర్థిక సాయం
These schemes are very useful for pregnant womens

దేశంలో ప్రజలందరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానంగా మహిళలు(womens), కుమార్తెల కోసం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈ పథకాల కింద మహిళలకు అనేక రకాల సహాయాలు అందించబడుతున్నాయి. వీటిలో గర్భిణీ స్త్రీల(pregnant womens) కోసం ఉపయోగపడే పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు మాత్రమే కాదు మీ కుటుంబంలోని మహిళలకు కూడా ఉపయోగపడుతుంది.


ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన

ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన (PMMVY) పథకంను కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం నిర్వహిస్తోంది. దీని ద్వారా పేదరికంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు సహాయం లభిస్తుంది. ఈ పథకం ద్వార మహిళలకు మొదటి గర్భధారణ సమయంలో రూ. 5,000, రెండో బిడ్డ పుట్టినప్పుడు రూ.6,000 సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అందజేస్తారు.

మొదటి సారి ప్రెగ్నెన్సీ నమోదు చేసుకున్నప్పుడు కనీసం ఒక్కసారైనా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మీకు రూ.3,000 సహాయంగా అందజేస్తారు. రెండవసారి మీ బిడ్డ జన్మించినప్పుడు, మొదటి టీకా ఇచ్చినప్పుడు మీకు రూ. 2,000 లభిస్తుంది. దరఖాస్తుదారు మహిళ వయస్సు 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకులు, ఆశాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న మహిళ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉండాలి.


ప్రసూతి భద్రత పథకం

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగితే ఈ పథకం కింద కాబోయే తల్లికి రూ.1,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు రూ.1400 ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాసుపత్రిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీ లబ్ధిదారుల పథకం

గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో పిల్లలు పుట్టిన తరువాత తరచుగా పోషకాహారలోపానికి గురవుతారు. ఇలాంటి చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ లబ్ధిదారుల పథకం కింద రూ.1500 వరకు సహాయం లభిస్తుంది.


ఇది కూడా చదవండి:

Stock Markets: రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ల దూకుడు.. ఏకంగా 1,231 పాయింట్లు

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

For Latest News and Business News click here

Updated Date - Jun 06 , 2024 | 01:38 PM