Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర..
ABN , Publish Date - Aug 29 , 2024 | 07:06 AM
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి.
హైదరాబాద్: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్నిరోజులుగా బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం రోజు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారం ధరల వివరాలు తెలుసుకుందాం.. పదండి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,310గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 73,410గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.73,260గా ఉంది.
బంగారం ధర | 22 క్యారెట్లు | 24 క్యారెట్లు |
హైదరాబాద్ | 67,160 | 73,260 |
విజయవాడ | 67,160 | 73,260 |
విశాఖపట్టణం | 67,160 | 73,260 |
ఢిల్లీ | 67,310 | 73,410 |
ముంబై | 67,160 | 73,260 |
తగ్గిన వెండి ధర
వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణెలో కిలో వెండి ధర రూ.88,400గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.