Gold And Silver Price: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. ఎంతంటే..
ABN , Publish Date - Oct 17 , 2024 | 08:02 AM
గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరిగింది. కార్తీక మాసం వస్తోండటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం అవబోతుంది. పూజలు, వ్రతాలతో మహిళలు బిజీగా ఉంటారు. దాంతోపాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ఉంటాయి. ఇంకేముంది బంగారం ధరలకు రెక్కలొస్తాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. గురువారం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పదండి.
పెంపు, తగ్గింపు ఇలా..
బంగారం స్వచ్ఛతను క్యారట్లలో లెక్కిస్తారు. క్యారెట్ విలువ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. బంగారాన్ని భారత దేశం దిగుమతి చేసుకుంటుంది. దాంతో డాలర్ మారకపు విలువ ఆధారంగా బంగారం ధరలు ఉంటాయి.
హైదరాబాద్‌లో ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,200గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,840గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,750 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.75,875గా ఉంది. విశాఖపట్టణంలో ఆర్నమెంట్ బంగారం ధర రూ.71,400గా ఉండగా, మేలిమి బంగారం ధర రూ.77,600గా ఉంది. చెన్నైలో ఆర్నమెంట్ బంగారం ధర రూ.71,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.94,531గా ఉంది. విజయవాడలో 93,600, విశాఖపట్టణంలో 94 వేలు, చెన్నైలో లక్ష 3 వేలుగా ఉంది.
బంగారం | 22 క్యారెట్లు | 24 క్యారెట్లు |
హైదరాబాద్ | 72,200 | 78,840 |
విజయవాడ | 71,750 | 75,875 |
బంగారం | 22 క్యారెట్లు | 24 క్యారెట్లు |
విశాఖపట్టణం | 71,400 | 77,600 |
చెన్నై | 71,400 | 77,600 |