Share News

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ABN , Publish Date - Nov 26 , 2024 | 07:50 AM

మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.వెయ్యి వరకు తగ్గుదల నమోదైంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
Gold Rates

హైదరాబాద్: కార్తీక మాసం శుభప్రదం. శుభకార్యాలు, మంచి పనులు చేస్తుంటారు. బంగారం కొనుగోలుపై మహిళలు ఆసక్తి చూపిస్తారు. గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు పెరగుతూ తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.వెయ్యి వరకు తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.


iStock-gold.jpg


హైదరాబాద్‌లో ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,990గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.78,540గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో ధరలు ఇదే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,140గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.78690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540గా ఉంది.


GOLD-LOAN.jpg


చెన్నై, బెంగళూర్‌లో ఇలా..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540 ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990 ఉండగా, మేలిమి బంగారం ధర రూ. 78,540 ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540 ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990 ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.91,400గా ఉంది.

ఇవి కూడా చదవండి:

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 26 , 2024 | 07:50 AM