Share News

Today Gold Rates: మరీ ఇంత పిరమా.. బంగారం ముట్టుకుంటే షాకే

ABN , Publish Date - Dec 12 , 2024 | 07:50 AM

Today Gold Rates: బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. తగ్గినట్లే కనిపించిన పసిడి మళ్లీ జోరందుకొని పరుగులు పెడుతోంది. ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Today Gold Rates: మరీ ఇంత పిరమా.. బంగారం ముట్టుకుంటే షాకే

బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. తగ్గినట్లే కనిపించిన పసిడి మళ్లీ జోరందుకొని పరుగులు పెడుతోంది. ఎవరి అంచనాలకు అందకుండా వడివడిగా దూసుకెళ్తోంది గోల్డ్. మరో ఆభరణం వెండిది కూడా దాదాపుగా ఇదే వరస. ఈ రెండూ మహిళలకు షాక్ ఇస్తున్నాయి. రెండ్రోజుల తేడాలోనే రేట్లు అమాంతం ఊపందుకున్నాయి. ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతూ వస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా నగల వ్యాపారులు, స్టాకిస్టుల కొనుగోళ్ల పెరుగుదల వల్ల దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధరలు రూ.80,000 మార్క్‌ను చేరుకున్నాయి.


ఆగని ధరల పరుగు

హైదరాబాద్‌లో గురువారం నాడు గోల్డ్ రేట్స్ చూసుకుంటే.. 24 క్యారెట్ల బంగారం తులం రూ.79,480 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.72,860గా ఉంది. గత రెండు, మూడు రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. వరుసగా మూడో రోజు రూ.1,450 పెరిగిన వెండి.. ఇవాళ కిలో రూ.96,300కి చేరింది. బంగారం-వెండి ధరల పెరుగుదలకు అమెరికాలో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయనే అంచనాలు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోడ్డ్ రేట్ 2,700 డాలర్లకు చేరువైంది. కాగా, పసిడి పరుగుల వెనుక అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు పుంజుకోవడం కూడా దోహదం చేస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.


Also Read:

టాప్‌ 500 స్టాక్స్‌కు అదే రోజు సెటిల్‌మెంట్‌

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

వృద్ధి క్షీణతకు రెపో కారణం కాదు

For More Business And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 08:39 AM