Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర
ABN , Publish Date - Aug 03 , 2024 | 07:19 AM
శ్రావణ మాసం వచ్చేస్తోంది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కళకళ లాడతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది.
హైదరాబాద్: శ్రావణ మాసం వచ్చేస్తోంది. బంగారం ధరలకు (Gold Rates) రెక్కలొస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కళకళ లాడతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది. బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం 6 శాతం తగ్గించింది. దాంతో ధరలు తగ్గాయి. ఆ తర్వాత మాత్రం వరసగా పెరుగుతూ వస్తోన్నాయి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,810గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ చేరింది. రూ.70,700గా ఉంది. విశాఖపట్టణం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,700గా ఉంది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 64,810 | 70,700 |
విజయవాడ | 64,810 | 70,700 |
ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.64,960గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,850గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,810గా ఉండగా, మేలిమి బంగారం ధర రూ. 70,700గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,810గా ఉంది. మేలిమి బంగార ధర రూ.70,700గా ట్రేడ్ అవుతోంది.
విశాఖపట్టణం | 64,810 | 70,700 |
ఢిల్లీ | 64,960 | 70,850 |
ముంబై | 64,810 | 70,700 |
వెండి ధర కూడా..
వెండి ధర కూడా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది. ముంబైలో రూ.87,300, బెంగళూర్‌లో కిలో వెండి 86,100, చెన్నైలో కిలో వెండి ధర 90,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.90,900గా ఉంది.
Read More Business News and Latest Telugu News