Loan Apps: లోన్ యాప్స్ గురించి ప్రజలను హెచ్చరించిన Zerodha CEO
ABN , Publish Date - Jan 10 , 2024 | 01:04 PM
Zerodha వ్యవస్థాపకులు, CEO నితిన్ కామత్ ఎప్పటికప్పుడు ఆర్థిక చిట్కాలను ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇటివల డిజిటల్ అవతార్ లాంటి రుణ యాప్‌ల గురించి ప్రజలను హెచ్చరించారు.
Zerodha వ్యవస్థాపకులు, CEO నితిన్ కామత్ ఎప్పటికప్పుడు ఆర్థిక చిట్కాలను ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇటివల డిజిటల్ అవతార్ లాంటి రుణ యాప్‌ల గురించి ప్రజలను హెచ్చరించారు. లోన్ యాప్స్ ఇష్టానుసారంగా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీ రూపంలో వసూలుచేస్తుందని గుర్తు చేశారు. దీని కారణంగా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. క్రమంగా నకిలీ రుణ యాప్‌ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు. అంతేకాదు వీరి వలలో ఎక్కువగా యువత పడుతున్నట్లు చెప్పారు. వీటిని ఎంచుకున్న వారు ఆర్థికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు.
Zerodha CEO నితిన్ కామత్ X (గతంలో Twitter)లో ఈ మేరకు పేర్కొంటూ కాంటాక్ట్‌లు, సందేశాలు, ఫోటోలు మొదలైన వాటికి యాక్సెస్ కోసం అడిగే ఫైనాన్స్ యాప్స్ డేంజర్ అని వెల్లడించారు. ఇలాంటి రుణ యాపుల విషయంలో ప్రజలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. వీటిలో వడ్డీ రేట్లు 50% నుంచి 100% వరకు లేదా 200% కంటే ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ యాప్‌లలో రుణం తీసుకున్న వ్యక్తులు రుణాన్ని తిరిగి చెల్లించడం అసాధ్యమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ యాప్‌లలో రుణాలు తీసుకునే వ్యక్తులు ప్రారంభంలో ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. లోన్ యాప్‌లు రుణాలు ఇచ్చిన వారి కాంటాక్ట్‌లు, ఫోటోలు వీడియోలకు యాక్సెస్‌ను పొందుతాయి. ఆపై డబ్బును రికవరీ చేయడానికి, వారి పరిచయాల వ్యక్తులకు కాల్ చేసి ఫోటోలు, అశ్లీల చిత్రాల ద్వారా వేధిస్తారని హెచ్చరించారు.