Share News

Tamil Nadu: దారుణం.. ఎదురింటి వాషింగ్ మెషిన్‌లో మూడేళ్ల చిన్నారి మృతదేహం

ABN , Publish Date - Sep 10 , 2024 | 07:43 AM

తమిళనాడులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 3 ఏళ్ల చిన్నారి మృతదేహం ఎదురింటి వారి వాషింగ్ మెషీన్‌లో లభ్యమైంది. షాకింగ్‌కు గురిచేస్తున్న ఈ ఘటన సోమవారం జరిగింది. బాలుడు ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఇంటి చుట్టుల ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియదు.

Tamil Nadu: దారుణం.. ఎదురింటి వాషింగ్ మెషిన్‌లో మూడేళ్ల చిన్నారి మృతదేహం

చెన్నై: తమిళనాడులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 3 ఏళ్ల చిన్నారి మృతదేహం ఎదురింటి వారి వాషింగ్ మెషీన్‌లో లభ్యమైంది. షాకింగ్‌కు గురిచేస్తున్న ఈ ఘటన సోమవారం జరిగింది. బాలుడు ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఇంటి చుట్టుల ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియదు. ఎంత వెతికినా ప్రయోజనం దక్కకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగుచూసింది.


3 ఏళ్ల బాలుడు విగతజీవిగా ఎదురింటి వారి వాషింగ్ మెషిన్‌లో కనిపించాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కాగా ఇదీ అత్యంత క్రూరమైన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో జరిగింది.


బాలుడి పేరు సంజయ్ అని, కనిపించకుండా పోయే ముందు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, తనిఖీ చేస్తుండగా ఎదురుగా ఉన్న ఇంటి వాషింగ్ మెషీన్‌లో శవమై కనిపించాడని వాపోయారు. 35 ఏళ్ల వయసున్న నిందిత మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి కుటుంబానికి, బాలుడి కుటుంబానికి ఆస్తి విషయంలో వివాదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు నిందితురాలు కొంతకాలం క్రితం తన కొడుకుని కోల్పోయి తీవ్ర డిప్రెషన్‌ సమస్యతో బాధపడుతోందని వివరించారు. ఇరు కుటుంబాల మధ్య భూవివాదంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలమని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Sep 10 , 2024 | 07:43 AM