Share News

Anantapur: షాపులో పనిచేస్తూనే.. చోరీకి స్కెచ్‌

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:14 PM

షాపులో ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకస్తుడే యజమాని ఇంట్లో చోరీకి స్కెచ్‌ వేశాడు. స్నేహితులతో కలిసి చోరీ చేసి, పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని మదనపల్లి(Madanapalli) రహదారిలోని యామినీ మెడికల్‌ స్టోర్‌ యజమాని ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

Anantapur: షాపులో పనిచేస్తూనే.. చోరీకి స్కెచ్‌

కదిరి(సత్యసాయి): షాపులో ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకస్తుడే యజమాని ఇంట్లో చోరీకి స్కెచ్‌ వేశాడు. స్నేహితులతో కలిసి చోరీ చేసి, పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని మదనపల్లి(Madanapalli) రహదారిలోని యామినీ మెడికల్‌ స్టోర్‌ యజమాని ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆ వివరాలను కదిరి(Kadiri) పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. పట్టణానికి చెందిన మధుసూదన్‌ మదనపల్లి రహదారిలో యామినీ వెటర్నరీ మెడికల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షాపు, మొదటి అంతస్తులో ఆయన ఇల్లు ఉంది. పట్టణంలోని నిజాంవలీ కాలనీకి చెందిన షేక్‌ హైదర్‌వలీ(Sheikh Hyderwali) షాపులో పదేళ్లుగా పనిచేస్తుండేవాడు. వ్యసనాలకు బానిసయ్యాడు.

ఇదికూడా చదవండి: Bangalore: బలపడుతున్న ‘బంధం’


వాటిని తీర్చుకునేందుకు అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మెడికల్‌ షాపు నిర్వాహకుడు మధుసూదన్‌ రూ.11.30 లక్షల నగును ఇంట్లోని బీరువాలో ఉంచి అదేరోజు బెంగళూరు(Bangalore) వెళ్లారు. విషయం భార్య కల్యాణికి చెప్పారు. విషయం తెలుసుకున్న హైదర్‌వలీ ఆ డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. అందులో భాగంగా నిజాంవలీ కాలనీకి చెందిన మిత్రులు షేక్‌ అల్తాఫ్‌, కేదారి మహేష్‏తో కలిసి స్కెచ్‌ వేశాడు. ఐదో తేదీ మధ్యాహ్నం మెడికల్‌ షాపులో మధుసూదన్‌ భార్య కల్యాణి, హైదర్‌వలీ ఉన్నారు. కల్యాణి కంటపడకుండా అల్తాప్‌, మహేష్‌ వారి ఇంట్లోకి చొరబడేలా హైదర్‌వలీ సూచనలిచ్చాడు.


వారు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉంచిన నగదు, 1.34 కిలోల వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లిపోయారు. చోరీ చేసిన సొమ్ము నిజాంవలీ కాలనీకే చెందిన ఖాజాపీరా వద్ద ఉంచారు. షాపు యజమాని మధుసూదన్‌ 5వతేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి చేరుకున్నారు. 6న ఉదయమే బీరువాలో డబ్బు చూసుకోవడానికి తెరిచారు. బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో భార్యను అడిగారు. ఆమె తెలియదని చెప్పడంతో బీరువాను క్షుణ్ణంగా పరిశీలించారు. బీరువాలోని నగదుతోపాటు వెండి వస్తువులు కూడా చోరీ అయినట్లు గుర్తించారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీలత.. పట్టణ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ బాబ్‌జాన్‌తో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రెండు బృందాలుగా విడిపోయి, దర్యాప్తు చేపట్టారు.


సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు వ్యక్తులు చోరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. గురువారం స్థానిక నేహా ఫంక్షన్‌హాల్‌ సమీపంలో వారిని అరెస్టు చేశారు. వారితోపాటు ఖాజాపీరా కూడా అక్కడే ఉండడంతో నలుగురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10.30 లక్షల నగదు, 1.34 కిలోల వెండి వస్తువులు, మొబైల్‌ ఫోన్‌స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12లక్షలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐలు బాబ్‌జాన్‌, బలరామయ్య, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ విక్టర్‌, కానిస్టేబుల్‌ రామాంజులు, హరినాథ్‌రెడ్డి, నాగరాజు, శివశంకర్‌రెడ్డి, రాజప్పను ఎస్పీ అభినందించారు. రివార్డులు ప్రకటించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 12:14 PM