Share News

Chennai: బిచ్చగాడి ప్రాణం తీసిన బీడీ ముక్క

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:59 AM

ఒక యాచకుడిని తోటి భిక్షగాడు హత్య చేశాడు. సగం కాల్చిన బీడీ ముక్క యాచకుడి హత్యకు కారణమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శాంథోమ్‌ వద్ద రాత్రి వేళల్లో దాదాపు 50 మంది వరకు యాచకులు నిద్రిస్తుంటారు. ఇలాంటి వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన సుకు అనే దివ్యాంగ భిక్షగాడు అక్కడే ఉంటున్నాడు.

Chennai: బిచ్చగాడి ప్రాణం తీసిన బీడీ ముక్క

- సహచరుడే నిందితుడు

చెన్నై: స్థానిక శాంథోమ్‌ చర్చి ప్రాంతంలో ఒక యాచకుడిని తోటి భిక్షగాడు హత్య చేశాడు. సగం కాల్చిన బీడీ ముక్క యాచకుడి హత్యకు కారణమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శాంథోమ్‌ వద్ద రాత్రి వేళల్లో దాదాపు 50 మంది వరకు యాచకులు నిద్రిస్తుంటారు. ఇలాంటి వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన సుకు అనే దివ్యాంగ భిక్షగాడు అక్కడే ఉంటున్నాడు. సుకు దివ్యాంగుడు కావడంతో వేళచ్చేరి(Velachery) ప్రాంతానికిని ఆనంద్‌ (42) అనే మరో బెగ్గర్‌ సాయం చేసేవాడు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: వన్‌సైడ్‌ లవ్‌ కాదు.. ఇద్దరం ప్రేమించుకున్నాం


ఈ క్రమంలో సుకు బీడీ కాల్సి సగ భాగాన్ని తన సంచిలో దాచాడు. సుకును అడగకుండా ఆ బీడీ ముక్కను ఆనంద్‌ తీసుకున్నారు. దీంతో సుకు కోపంగా ఆనంద్‌తో గొడవపడి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఆనంద్‌ తప్పించుకుని సుకు తలను బలంగా గోడకు వేసి కొట్టి అక్కడ నుంచి వేళచ్చేరి వెళ్ళిపోయారు. తీవ్రంగా గాయపడిన సుకు అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. దీనిని గమనించిన పాదాచారులు 108కు ఫోన్‌ చేశారు.


city2.2.jpg

108 అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి సుకును స్థానిక రాయపేట(Rayapeta) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సుకు మృతిచెందాడు. పోస్టుమార్ట నివేదికలో తలకు బలమైన గాయం తగలడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, శాంథోమ్‌ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ పరిశీలించగా, అసలు విషయం తెలిసింది. దీంతో వేళచ్చేరిలో ఉన్న ఆనంద్‌ను అరెస్టు చేశారు. బీడీ ముక్క విషయంలో గొడవపడటంతో దాడి చేసినట్టు అంగీకరించాడు.


ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య

ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భేటీ

ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2024 | 11:00 AM