Share News

Chennai: ప్రేమ వ్యవహారంలో.. యువకుడిని చంపేశారు...

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:33 PM

తన చెల్లిని ప్రేమించిన యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన సోదరుడిని, హత్యకు సాయపడిన అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాళయంకోట పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం మేరకు కళ్లకురిచ్చి జిల్లాకు చెందిన విజయ్‌ (25) అనే యువకుడికి నాగర్‌కోవిల్‌(Nagercoil)లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతితో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Chennai: ప్రేమ వ్యవహారంలో.. యువకుడిని చంపేశారు...

- ప్రియురాలి సోదరుడు సహా ఇద్దరి అరెస్టు

చెన్నై: తిరునల్వేలిలో తన చెల్లిని ప్రేమించిన యువకుడిని కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన సోదరుడిని, హత్యకు సాయపడిన అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాళయంకోట పోలీసుల విచారణలో వెల్లడైన సమాచారం మేరకు కళ్లకురిచ్చి జిల్లాకు చెందిన విజయ్‌ (25) అనే యువకుడికి నాగర్‌కోవిల్‌(Nagercoil)లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతితో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న యువతి సోదరుడు పుష్పరాజ్‌, కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: రాష్ట్రమంతటా ‘ఫెంగల్‌’ బీభత్సం..


దీంతో నాలుగు రోజుల క్రితం ఆ యువతి ఇంటిలో చెప్ప్టకుండా విజయ్‌ ఇంటికి వెళ్ళి అతడి కుటుంబీకులను కలుసుకుని తామిద్దరమూ ప్రేమించుకుంటున్నామని, పెళ్ళికి అంగీకరించమని వేడుకుంది. యువతి తరఫు కుటుంబీకులు అంగీకరిస్తేనే విజయ్‌(Vijay)తో పెళ్ళి జరిపిస్తామని ఆమెను వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ యువతి సోదరుడు పుష్పరాజ్‌ ఆగ్రహించి విజయ్‌ని హతమార్చాలని పథకం వేసుకున్నాడు.


ఆ మేరకు తిరునల్వేలిలో తన స్నేహితుడు శివా ఇంటికి వస్తే తన పెద్దలతో మాట్లాడి పెళ్ళి జరిగేలా చేస్తానని విజయ్‌ని నమ్మించాడు. ఆ మాటలు నమ్మి విజయ్‌ సోమవారం ఉదయం తిరునల్వేలి పాళయంకోట శాంతినగర్‌ అన్నానగర్‌లో ఉన్న అతడి స్నేహితుడు శివా ఇంటికి వెళ్ళాడు. పుష్పరాజ్‌, శివ(Pushparaj, Shiva) కలిసి ఆ ఇంటి మిద్దెపైనున్న గుడిసెలోకి విజయ్‌ని తీసుకెళ్ళి మాట్లాడారు. తన ఇంట్లో ప్రేమ పెళ్ళికి అంగీకరించరని పుష్పరాజ్‌ చెప్పాడు. దీనితో విజయ్‌ అతడితో గొడవపడ్డాడు. పెళ్ళికి రాజీ కుదుర్చుతాననని చెప్పి తనను మోసగిస్తారా అంటూ విజయ్‌ వారిని దుర్భాషలాడటంతో పుష్పరాజ్‌, శివా కత్తులతో అతడిపై దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు.


కత్తిపోట్లకు గురైన విజయ్‌ కేకలు విని ఇంటి చుట్టుపక్కల వారంతా ఆ మిద్దెపైకి వెళ్ళి గుడిసెలో చూడగా రక్తపు మడుగులో విజయ్‌ పడి ఉండటంతో దిగ్ర్భాంతి చెంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాళయం కోట పోలీసులు హుటాహుటిన అక్కడికికి చేరుకుని విజయ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. విజయ్‌ని హతమార్చి మిద్దె ఇంటి నుండి పుష్పరాజ్‌, శివా పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు సాక్ష్యం చెప్పటంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇరువురిని అరెస్టు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2024 | 01:33 PM