Chennai: హత్యకు దారితీసిన అక్రమసంబంధం..
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:17 AM
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూరు(Tirupur) జిల్లా అవినాశి యూనియన్ వేలాయుధపాళెయం పంచాయతీ కాశీగౌండంపాళెయం ప్రాంతానికి చెందిన రమేశ్ (48) టూవీలర్, కార్లు కొనుగోలు చేసి విక్రయించడం, ఆస్తులను తనాఖా పెట్టుకుని వడ్డీకి రుణాలిస్తున్నారు.
- అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య
- ప్రియుడి సహా ముగ్గురి అరెస్టు
చెన్నై: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూరు(Tirupur) జిల్లా అవినాశి యూనియన్ వేలాయుధపాళెయం పంచాయతీ కాశీగౌండంపాళెయం(Kasi Goundampalayam) ప్రాంతానికి చెందిన రమేశ్ (48) టూవీలర్, కార్లు కొనుగోలు చేసి విక్రయించడం, ఆస్తులను తనాఖా పెట్టుకుని వడ్డీకి రుణాలిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: రుణ బకాయిల కోసం వెళ్తే శునకంతో దాడి..
ఈయనకు విజయలక్ష్మి (44) అనే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ నెల ఒకటో తేదీన రమేష్ వాకింగ్‌కు వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజీ(CCTV footage)లను పరిశీలించగా, రమేష్‌ను నిర్మానుష్య ప్రాంతానికి కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో గోపాలకృష్ణన్ (35), అజీత్ (27), సింబోస్ (23), చరణ్ (24), జయ ప్రకాష్ (45) అనే ఐదుగురిని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు.
విచారణలో రమేష్ భార్య విజయలక్ష్మికి అవినాశి మంగళం సాలైలో చిప్స్ దుకాణం నడిపే ఇర్ఫాన్ (28) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు గుర్తించారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో కిరాయి ముఠాతో చేతులు కలిపి భర్తను హత్య చేయించినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో విజయలక్ష్మి, కిరాయిముఠా నాయకుడు జానకిరామన్ సహా మొత్తం ముగ్గురుని శుక్రవారం అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News