Chennai: రుణ బకాయిల కోసం వెళ్తే శునకంతో దాడి..
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:02 AM
కోయంబత్తూరులో రుణ బకాయిలు వసూలు చేయడానికి వెళ్ళిన ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఆ విదేశీ జాతి శునకం ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిని 12 చోట్ల కరవటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- వసూలుకెళ్ళిన ఫైనాన్స్ ఉద్యోగిపై కుక్కను ఉసిగొల్పిన మహిళ అరెస్టు
చెన్నై: కోయంబత్తూరులో రుణ బకాయిలు వసూలు చేయడానికి వెళ్ళిన ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఆ విదేశీ జాతి శునకం ఫైనాన్స్ సంస్థ ఉద్యోగిని 12 చోట్ల కరవటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోయంబత్తూరు సమీపం వెల్లూరు మహాగణపతి నగర్‌లో మణికంఠన్ (32), దర్శనా అలియాస్ ప్రియా (29) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: వామ్మో.. బాగానే పెరిగిందిగా.. మునక్కాయలు కిలో రూ.400
మణికంఠన్(Manikandan) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ నాలుగేళ క్రితం రూ.2లక్షలు అడ్వాన్స్ చెల్లించి రూ.6.5ల విలవైన లగ్జరీకారు కొన్నాడు. మిగతా రూ.4.5 లక్షలకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో నెలకు రూ.6 వేల చొప్పున వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించేలా రుణం తీసుకున్నాడు. అయితే 20 నెలలుగా మణికంఠన్ ఆ ఫైనాన్స్ సంస్థకు వాయిదాలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కారు స్వాధీనం చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు జగదీష్ (45), సురేష్, కదిరవన్ గురువారం ఉదయం మణికంఠన్ ఇంటికి వెళ్ళారు.
నెలవారి బకాయిలు చెల్లించమని ఫెనాన్స్ ఉద్యోగులు కోరగా తమ వద్ద డబ్బులు లేవని బదులిచ్చారు. దీంతో ఆ ఉద్యోగులు తమ దగ్గరున్న మారు తాళం చెవితో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న కారును స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వెంటనే మణికంఠన్ ఆ కారెక్కి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంటి గుమ్మం వద్దే ఉన్న మణికంఠన్ భార్య ప్రియా తను పెంచుతున్న జర్మన్‌షెఫర్డ్ జాతి శునకాన్ని ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులపై ఉసిగొల్పింది.
ఆ శునకం ఫైనాన్స్ ఉద్యోగి జగదీష్(Jagadish)పైకి వెళ్లి కరిచింది. తక్కిన ఇద్దరు ఉద్యోగులు అక్కడి నుండి భయంతో పరుగులు తీసారు. ఆలోగా స్థానికులు అక్కడికి రావటంతో ప్రియ తన శునకాన్ని వెనక్కి పిలిచి ఇంటిలోకి పంపింది. ఈ సంఘటనలో వళ్లంతా కుక్కకాట్లకు గురైన జగదీ్‌షను సహోద్యోగులు ఆసుపత్రికి తరలించారు. ఆ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు శునకాన్ని రెచ్చగొట్టి ఉద్యోగిపై ఉసిగొల్పి కరిపించిన ప్రియను పోలీసులు అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News