Chennai: జైలులో ఉన్న భర్తకు గంజాయి.. భార్య అరెస్టు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:26 PM
కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన ఖైదీతో జైలులో ఉన్న భర్తకు గంజాయి ప్యాకెట్ పంపించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నావూర్ సునామీ కాలనీ(Ernavur Tsunami Colony)కి చెందిన విజయ్ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
చెన్నై: కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన ఖైదీతో జైలులో ఉన్న భర్తకు గంజాయి ప్యాకెట్ పంపించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నావూర్ సునామీ కాలనీ(Ernavur Tsunami Colony)కి చెందిన విజయ్ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, ఓ కేసులో పుళల్ జైలులో ఉంటున్న తిరువొట్రియూరు(Thiruvotriyur)కు చెందిన గంజాయి వ్యాపారి పృథ్విరాజ్, ఈయన భార్య జోస్వా, తాంబరంకు చెందిన భరత్‌లను తిరువొట్రియూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Siddaramaiah: సంబరాల సభ.. హాసన్‌లో నిర్వహణకు సీఎం కసరత్తు
ఈ విషయం తెలుసుకున్న విజయ్ భార్య నందిని గంజాయి ప్యాకెట్లను జైలులో ఉన్న తన భర్తకు అందజేయాలని పృథ్విరాజ్‌కు ఇచ్చింది. ఈ విషయాన్ని ఖైదీల వెంట ఉన్న సాయుధ విభాగం పోలీసులు గుర్తించారు. దీంతో నందినితో పాటు ఆమెకు గంజాయి సరఫరా చేసిన రాజాజీ నగర్‌కు చెందిన మురళి, యోగేశ్వరన్ అనే వారిని అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News