Share News

Chennai: ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.500 కోట్ల మోసం!

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:58 PM

ఉత్తరాది ముఠాతో కలిసి నకిలీ మొబైల్‌ యాప్‌ సంస్థ నెలకొల్పి వేలాదిమందిని మోసగించిన కేసులో చెన్నై వాషర్‌మెన్‌పేట(Chennai Washermenpet)కు చెందిన శివరామ్‌ జయరామన్‌ (30)ను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

Chennai: ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.500 కోట్ల మోసం!

- చెన్నై యువకుడి అరెస్టు

చెన్నై: ఉత్తరాది ముఠాతో కలిసి నకిలీ మొబైల్‌ యాప్‌ సంస్థ నెలకొల్పి వేలాదిమందిని మోసగించిన కేసులో చెన్నై వాషర్‌మెన్‌పేట(Chennai Washermenpet)కు చెందిన శివరామ్‌ జయరామన్‌ (30)ను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఉత్తరాది మోసగాళ్ళతో కలిసి శివరామ్‌ జయరామన్‌ హైబాక్స్‌ పేరిట ఓ సంస్థ నెలకొల్పి ప్రముఖ యూట్యూబర్లు, సినీనటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి సుమారు రూ.500 కోట్ల మేరకు డిపాజిట్లు వసూలు చేసి మోసగించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Actor Vijay: నేను టైమ్‌పాస్‌ కోసం రాజకీయాల్లోకి రాలేదు..


తొలుత డిపాజిట్‌ చేసినవారిలో కొందరికి నిర్ణీత వ్యవధిలో డబ్బులు తిరిగి చెల్లించడం, వారికి అందమైన కానుకలు ఇవ్వడంతో ఆ సంస్థపై నమ్మకం ఏర్పడి వేలాదిమంది హైబాక్స్‌లో డిపాజిట్‌చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి డిపాజిట్‌దారులకు నగదు, వడ్డీ చెల్లింపులు ఆగిపోయాయి. తమ యాప్‌లో, సంస్థలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని, అవన్నీ చక్కదిద్దిన తర్వాత డబ్బులు చెల్లిస్తామంటూ శివరామ్‌ తదితరులు ప్రకటటించారు. రెండు మూడు నెలులు దాటిన హైబాక్స్‌, మొబైల్‌ యాప్‌ పనిచేయకపోవడంతో డిపాజిటర్లు మోసపోయినట్లు నిర్ధారించుకుని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇందులో కీలకపాత్ర వహించిన శివరామ్‌ ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. అతడి బ్యాంకులలోని రూ.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాలకు పాల్పడిన హైబాక్స్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ యూట్యూబర్‌ ఎల్విష్‌ యాదవ్‌, హాస్యనటి భారతి సింగ్‌ ను కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. శివరామ్‌పై సమాచార సాంకేతిక చట్టం ప్రకారం కేసు నమోదుచేశారు.


..........................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................

Gali Janardhan Reddy: మాజీమంత్రి ‘గాలి’ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

- ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి జోస్యం

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయినా తాను ప్రస్తుతం శానసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం దక్కించుకున్నాని, భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌(Gangavati MLA Gali Janardhan) రెడ్డి జోస్యం పలికారు. శుక్రవారం సండూరులో పర్యటించిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, బళ్ళారి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నానన్నారు. సండూరు శాసనసభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలవక పోయినా, సండూరు నుండి కూడ్లిగి, హొసపేట తోరణగల్లు వరకు రూ.200 కోట్లతో రోడ్డు నిర్మాణం చేసినట్లు తెలిపారు.

nani3.jpg


జింథాల్‌ లాంటి ఐదారు కంపెనీలు జిల్లా వస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించానని, అయితే తన ఆశయాలు, ఆకాంక్షలు నీరుగార్చిన సోనియాగాంధీ రాహుల్‌ గాంధీకి ఆ దేవుడు ప్రస్తుతం అఽధికారం లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ఒకరి జీవితం పాడుచేస్తే ఆ దేవుడు తనకు శిక్ష వేస్తాడనడానికి కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే సాక్ష్యమన్నారు. ముడా కేసులో సీయం సిద్దరామయ్య వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన అక్రమాలకు పాల్పడిన డబ్బు మొత్తం తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ వస్తానని, బీజేపీని ఆదరించాలని ప్రజలను కోరుతానన్నారు.


తనపై అభిమానం చూపిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానన్నారు. అంతకు ముందు ఆయన పట్టణంలోని విరక్తమఠానికి చేరుకుని ప్రభుస్వాముల ఆశ్వీర్వాదం పొందారు. అనంతరం కుమారస్వామి దేవస్థానానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రముఖులు కేఎస్‌ దివాకర్‌, బీజేపీ ఎస్టీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బంగారి హనుమంతు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జీటీ పంపాపతి, ప్రముఖులు విఠలాపుర తిరుమల, జేసిబి రామకృష్ణ, హుడేద సురేశ్‌, కరడి ఎర్రిస్వామి, గుడేకోట నాగరాజు, అంబరీశ, చోరనూరు అడివప్ప పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌస్ లు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 12:58 PM