Chennai: టీచర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు..
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:02 AM
మదురై(Madurai) జిల్లా ఉసిలంపట్టి తాలూకా విక్రమంగళం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మూర్తి అనే టీచర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్లస్-1 విద్యార్థిని జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఆ స్కూలులో చదువుతున్న విద్యార్థుల్లో కలకలం రేపింది.
- నిరసనగా విద్యార్థుల ఆందోళన
చెన్నై: మదురై(Madurai) జిల్లా ఉసిలంపట్టి తాలూకా విక్రమంగళం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మూర్తి అనే టీచర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్లస్-1 విద్యార్థిని జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఆ స్కూలులో చదువుతున్న విద్యార్థుల్లో కలకలం రేపింది. ఆ విద్యార్థిని టీచర్‌పై తప్పుడు ఫిర్యాదు చేసిందంటూ పాఠశాలలోని విద్యార్థినులంతా గురువారం తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగారు. టీచర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: అయ్య బాబోయ్ దిండివనంలో బస్‌స్టేషనా.. అయితే పదవీ గండం తప్పదా..
అధ్యాపకులు జోక్యం చేసుకుని అర్ధవార్షిక పరీక్షలు జరుగుతుండటంతో ఆందోళన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఆ మేరకు విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఈ విషయమై కొందరు విద్యార్థినులు మాట్లాడుతూ టీచర్ మూర్తి దగ్గర చదివి, ప్రస్తుతం ఆ పాఠశాలలోనే పనిచేస్తున్న మరొక టీచర్ ఆయనపై కక్ష పెంచుకుని కొంతమంది విద్యార్థినులను ఉసిగొల్పారని తెలిపారు.
విద్యార్థులు టీచర్ మూర్తి వద్దే ట్యూషన్లకు వెళ్తూ తన దగ్గరకు ఎవరూ ట్యూషన్‌క రావటం లేదన్న కక్షతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సంఘటనకు సంబంధించి టీచర్ మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై డీఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ ఇరువైపులా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే టీచర్ మూర్తిపై చర్యలు తీసుకొంటామని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News