Share News

Chennai: లేఖ రాసిన వింత దొంగ.. నెలలో అన్నీ తిరిగి ఇచ్చేస్తానంటూ చోరీ

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:53 AM

తూత్తుక్కుడి జిల్లాలో రిటైర్డ్‌ టీచర్‌(Retired Teacher) దంపతుల ఇంటిలో చోరీ జరిగింది. ఈ చోరీకి పాల్పడిన దొంగ... ఇంటిలోని బంగారం నగలు, డబ్బులు చోరీ చేస్తూ, తన భార్య అనారోగ్యంగా ఉందని, అందువల్ల చోరీ చేసిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తానంటూ ఒక లేఖ రాసిపెట్టిన ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Chennai: లేఖ రాసిన వింత దొంగ.. నెలలో అన్నీ తిరిగి ఇచ్చేస్తానంటూ చోరీ

చెన్నై: తూత్తుక్కుడి జిల్లాలో రిటైర్డ్‌ టీచర్‌(Retired Teacher) దంపతుల ఇంటిలో చోరీ జరిగింది. ఈ చోరీకి పాల్పడిన దొంగ... ఇంటిలోని బంగారం నగలు, డబ్బులు చోరీ చేస్తూ, తన భార్య అనారోగ్యంగా ఉందని, అందువల్ల చోరీ చేసిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తానంటూ ఒక లేఖ రాసిపెట్టిన ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మంజానపురంకు చెందిన చిత్తిరై సెల్వన్‌(79), ఈయనభార్య ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. వీరికి నలుగురు పిల్లలు. చెన్నైలో ఒక కుమార్తెను చూసేందుకు ఈ నెల 17వ తేదీ భార్యతో కలిసి చిత్తిరై సెల్వన్‌ నగరానికి వచ్చారు. ఆ సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను నియమించారు. సోమవారం సాయం త్రం ఆమె ఇంటి వాకిలిని శుభ్రం చేసేందుకు రాగా, ఇంటి తలుపులు తెరిచివుండటాన్ని గమనించి, వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించారు.

ఇదికూడా చదవండి: కాకాగూడలో కలకలం.. మూడు మూగజీవాలపై కట్టర్‌లతో దాడి


ఆ వెంటనే చిత్తిరై సెల్వన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఇంటికి వెళ్ళి పరిశీలించారు. బీరువాలో ఉన్న రూ.60 వేల నగదు, బంగారు నగలను చోరీకి గురైనట్టు గుర్తించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ చోరీకి పాల్పడిన దొంగ... ఒక లేఖను రాసి పెట్టాడు. అందులో ‘నన్ను క్షమించండి. నా భార్య ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చుల కోసమే ఈ చోరీ చేస్తున్నాను. ఒక నెలలో తిరిగి నగలు తెచ్చి ఇచ్చేస్తాను’ అని రాసిపెట్టారు. ఈ లేఖను చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నవ్వుకున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 11:53 AM