Chennai: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య..
ABN , Publish Date - Jul 16 , 2024 | 12:37 PM
కడలూరు(Kadaluru) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురినీ హతమార్చి, ఆనక వారి శవాలకు నిప్పంటించారు. ఓ ఇంట్లో దుర్గంధం రావడం గమనించిన చుట్టుపక్కల వారు... పోలీసులకు సమాచారం ఇవ్వగా, విషయం వెలుగుచూసింది.
- హతమార్చి, నిప్పంటించిన దుండగులు
- కడలూరుజిల్లాలో ఘోరం
చెన్నై: కడలూరు(Kadaluru) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురినీ హతమార్చి, ఆనక వారి శవాలకు నిప్పంటించారు. ఓ ఇంట్లో దుర్గంధం రావడం గమనించిన చుట్టుపక్కల వారు... పోలీసులకు సమాచారం ఇవ్వగా, విషయం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ... కడలూరు జిల్లా కారామణికుప్పం ప్రాంతానికి చెందిన కమలీశ్వరి (60) అనే వితంతువుకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సురేంద్రకుమార్ (42) కాకినాడలో ఉండగా, రెండో కుమారుడు సుగంధకుమార్ (40) హైదరాబాద్‌లో ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం సుగంధకుమార్ తన తొమ్మిదేళ్ల కుమారుడు నిశాంత్‌కుమార్‌తో కారామణికుప్పం వచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కమలీశ్వరి నుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కల వారు నెల్లికుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: తుపాకీ మిస్‌ఫైర్.. బెడ్‌రూంలోకి దూసుకొచ్చిన బుల్లెట్
పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి లోపలకు వెళ్ళి చూడగా.. వేర్వేరు గదుల్లో కమలీశ్వరి, ఆమె కుమారుడు సుగంధకుమార్, మనవడు నిశాంత్‌కుమార్ వళ్లంతా కాలి శవాలుగా పడి వున్నారు. ఆ గదుల్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉండటంతో ఆ ముగ్గురినీ గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా తాళం వేసిన ఇంటిలో శవాలుగా లభించడంతో కారామణికుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెల్లికుప్పం పోలీసులు మృతదేహాలను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హంతకుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News