Chennai: వామ్మో.. ఐఐటీ ప్రాంగణంలో గంజాయి.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:33 PM
స్థానిక తరమణిలో ఉన్న ఐఐటీ(IIT) ప్రాంగణంలో విద్యార్థులకు గంజాయి విక్రయించిన ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై: స్థానిక తరమణిలో ఉన్న ఐఐటీ(IIT) ప్రాంగణంలో విద్యార్థులకు గంజాయి విక్రయించిన ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తరమణి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల, ఐఐటీ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కన్నన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం తరమణి ప్రాం తంలో నిఘా వేసింది. ఐఐటీ ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరించిన ఇద్దరు యువకులను ప్రశ్నించగా పొంతన లేకుండా సమాధానం చెప్పారు. దీంతో, అసోం రాష్ట్రానికి చెందిన రెహ్మాన్, ఒడిశాకు చెందిన కుమార్‌జిన్నాను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. నిందితులు తరమణి ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తూ గంజాయి పొట్లాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, సోమవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.