Share News

Chittoor: ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:38 AM

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సత్యవేడు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రామస్వామి(SI Ramaswamy) తెలిపిన వివరాల మేరకు... శుక్రవారం స్థానిక పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు.

Chittoor: ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

- 80 గ్రాముల బంగారం, కారు స్వాధీనం

సత్యవేడు(చిత్తూరు): ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సత్యవేడు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రామస్వామి(SI Ramaswamy) తెలిపిన వివరాల మేరకు... శుక్రవారం స్థానిక పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ఊత్తుకోట నుంచి వస్తున్న కారు పోలీసులను చూసి దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తయైు కారును చుట్టుముట్టామన్నారు. కారులో ఉన్న ఐదుగరిని అదుపులోకి తీసకున్నామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Srikalahasti: వైసీపీ నేత బుల్లెట్‌ జయశ్యామ్‌ అరెస్టు..


అనంతరం కారును తనిఖీ చేయగా 80 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని విచారించగా మండలంతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతన్నట్టు తేలిందన్నారు. ఈ ముఠా సత్యవేడు మండలం శిరుణంబూదూరులో ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఓ ఇంటి తలుపులు ధ్వంసం చేసి బీరువాలో ఉన్న 40 గ్రాముల బంగారు చోరీ చేసిందన్నారు. అదే విధంగా దాసుకుప్పంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ మద్యాహ్నం ఓ ఇంట్లో 40 గ్రాముల బంగారం చోరీ చేసినట్టు విచారణలో అంగీకరించారని తెలిపారు.


అదే విధంగా తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం ఈరోడ్‌, రాణిపేట జిల్లాల్లో కూడా ఇటీవల తాజాగా చోరీలకు పాల్పడి కారుతో పాటు బంగారు నగలను అపహరించినట్లు తేలిందన్నారు. పట్టుబడ్డ వారిలో తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా సావుకుప్పానికి చెందిన వి.కన్నదాసన్‌(28), తిరువణ్ణామలై జిల్లా వెంగిక్కల్‌కు చెందిన జీ.శ్రీరామ్‌ అలియాస్‌ బిల్లు (19), రంజిత్‌కుమార్‌ (19), కాంచీపురం జిల్లా మధురమంగళానికి చెందిన డి.రవి(27), విల్లుపురం జిల్లా సెంజివట్టానికి చెందిన బాలుడు ఉన్నారు. వీరు తమిళనాడులో వివిధ కేసుల్లో జైలుశిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది.

nani4.jpg


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 11:38 AM