Share News

Murdered : సీఐ తల్లిది హత్యే

ABN , Publish Date - Oct 08 , 2024 | 11:54 PM

ఆమె ఓ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తల్లి. పది రోజుల కిందట మిస్సింగ్‌ అయింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేర చరితుడు కావడంతో పోలీసులకు చిక్క కుండా దృశ్యం సినిమా తరహాలో మొబైల్‌ ఫోన్‌, సిమ్‌ ఇంట్లోనే పడేసి పరారయ్యాడు.

Murdered : సీఐ తల్లిది హత్యే
గుంతలో నుంచి సంచితో వెలికితీసిన స్వర్ణకుమారి మృతదేహం

10 రోజుల తరువాత వెలుగులోకి

మదనపల్లె అర్బన్‌, అక్టోబరు 8: ఆమె ఓ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తల్లి. పది రోజుల కిందట మిస్సింగ్‌ అయింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేర చరితుడు కావడంతో పోలీసులకు చిక్క కుండా దృశ్యం సినిమా తరహాలో మొబైల్‌ ఫోన్‌, సిమ్‌ ఇంట్లోనే పడేసి పరారయ్యాడు. అంతేకాకుండా విమానాల్లో తిరుగుతూ, జల్సాలు చేశాడు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు సాకేంతిక పరిజ్ఞానంతో ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు..

మదనపల్లెకు చెందిన నాగేంద్రప్రసాద్‌ ధర్మవరం వన్‌టౌన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తల్లి స్వర్ణకు మారి (వాల్మీకిపురం మండలం మంచూరు స్వగ్రామం) పట్టణ శివారులోని జగన్‌ కాలనీలో సొంత ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న స్వర్ణ కుమారి చుట్టుపక్కల అందరితో కలివి డిగా వుండేది. ఈ క్రమంలో ఆమె ఇంటి ఎదురుగా వుండే వెంకటేష్‌ (గతంలో మంచూరు గ్రామ యువకుడు) స్వర్ణకు మారికి ఇంటి వస్తువులు, సరుకులు తెచ్చి స్తూ సహాయంగా వుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ అవసరాల కోసం స్వర్ణకుమారి వద్ద రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. స్వర్ణ కుమారికి భక్తి భావం ఎక్కువగా వుండడంతో గత నెల 28న ఉదయం ఓ పూజారి వద్దకు తీసుకెళ్తానని వెంకటేశ్‌ ఆమెను ద్విచక్ర వాహ నంలో తీసుకెళ్లాడని తెలిసింది. అప్పటి నుంచి స్వర్ణకుమారి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చినట్లు స్థానికులు చెప్పారు. మూడు రోజులైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కాలనీవాసులు స్వర్ణకుమారి కుమా రుడు నాగేందప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. స్వర్ణకు మారి కనిపించడం లేదని నాగేంద్రప్రసాద్‌ 2వ తేదీ మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


8mpl-U6.gif గొయ్యి తీసి పూడ్చడానికి సిద్ధం చేసిన ఏర్పాట్లు - చిత్రంలో కుమారుడు, కుటుంబీకులు

నగలు కుదవ...విమానాల్లో ప్రయాణాలు

స్వర్ణకుమారిని కిడ్నాప్‌ చేసిన వెంక టేశ్‌ ఆమె ధరించిన బంగారు నగల ను పట్టణంలోని ప్రైవేటు ఫైనాన్స్‌లో కుదవ పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఈ డబ్బులో కొంత ఇంట్లోనే దాచి మిగిలిన డబ్బుతో పరారయ్యాడు. పోలీసులకు చిక్కకుండా మొబైల్‌ ఫోన్‌, సిమ్‌ కార్డులు పడేసి వెళ్లిపోయాడు. అంతేకాకుండా స్వర్ణకుమారి మొబైల్‌ ఫోన్‌ను కాల్‌ఫార్వర్డ్‌ చేసినట్లు తెలి సింది. దీంతో ఇతని ఆచూకీ కనిపె ట్టేందుకు పోలీసులు తలమునకల య్యారు. వెంకటేశ్‌ స్నేహితులపై పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమం లో బెంగళూరులో వున్న వెంకటేశ్‌ మరో ఫోన్‌ సిమ్‌ వాడుతున్నట్లు అను మానం వచ్చిన పోలీసులు ఆ కోణం లో దర్యాప్తు మొదలెట్టారు. రెండు రోజుల కిందట ఒక ప్రాంతం నుంచి వెంకటేశ్‌ స్విగ్గీలో ఆహారం ఆర్డర్‌ పెట్టాడు. దీనిపై నిఘా వేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి వెంకటేశ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు

వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితు డిని విచారించారు. స్వర్ణకుమారిని కిడ్నాప్‌ మొదలు ఆమె హత్య వరకు జరిగిన ఘటనలపై పోలీసులకు వివరించి నట్లు సమాచారం. పోలీసులు మంగళవారం వెంకటేశ్‌ను వెంటబెట్టుకుని స్థానిక అయోధ్యనగర్‌ సమీపంలోని శ్మశా నవాటికకు వెళ్లారు. అక్కడ ఓ సమాధి కింద స్వర్ణకుమా రి మృతదేహాన్ని పూడ్చినట్లు చెప్పడంతో పోలీసులు, తహ సీల్దార్‌ ఖాజాబీ, ప్రభు త్వాస్పత్రి వైద్యులు శ్మశానానికి చేరు కు న్నారు. ఇదివరకే ఒక శవాన్ని పూడ్చిన చోటే, గో యి తీసి అక్కడే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి వుండ డాన్ని గుర్తించారు. వైద్యులు అక్కడే స్వర్ణకుమారి మృతదే హానికి పోస్టుమార్టం నిర్వహించారు.


హత్య వెనుక అనిల్‌ పాత్ర..

వెంకటేశ్‌కు మదనపల్లె పట్టణం గజ్జెల కుంట యువకుడు అనిల్‌ పరిచితుడు. స్వర్ణకుమారిని కిడ్నాప్‌ చేసిన వెంకటేశ్‌ అనిల్‌ ఇంటికి తీసు కెళ్లిన ట్లు సమాచారం. అక్కడే స్వర్ణకుమారిని తుదము ట్టించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు కారును అద్దెకు తీసుకుని మృతదేహాన్ని గోనెసంచెలో చుట్టి అదే రోజు పోతబోలు గ్రామానికి తీసుకెళ్లగా గ్రామస్థు లు వీరిని ప్రశ్నించడంతో తిరిగి పట్టణానికి చేరుకు ని అయోధ్యనగర్‌ సమీపంలోని శ్మశానవాటికలో పూడ్చినట్లు విచార ణలో తెలిసింది. కాగా వెంకటేశ్‌, అనిల్‌ ఇద్దరూ గంజాయికి అలవాటు పడి గతంలో నేరాలు చేసినట్లు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు సమాచారం. మదన పల్లె వన్‌, టూటౌన్‌, తాలుకా, రూరల్‌ పోలీస్‌స్టేషన్ల సీఐలు చాంద్‌బాషా, రామచంద్ర, కళా వెంకటరమణ, రమేష్‌, తాలుకా ఎస్‌ఐ చంద్రమోహన్‌ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. శ్మశా నవాటికలో స్వర్ణ కుమారి మృతదేహా న్ని వెలికి తీసినప్పు డు ఆమె కుమారుడు నాగేంద్ర ప్రసాద్‌, కు టుంబీకులు పోస్టు మార్టం అనంతరం పక్కనే తవ్విన మరో గోతిలో స్వర్ణకు మారి అంత్యక్రియలు చేశారు.

Updated Date - Oct 08 , 2024 | 11:54 PM