Share News

Karnataka: రూ.2వేలు పెట్టిన చిచ్చు.. టీచర్ చేసిన పనికి విద్యార్థిని బలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:24 PM

కర్ణాటకలో (Karnataka) హృదయాల్ని కదిలించే ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.2వేల కోసం ఓ టీచర్ పెట్టిన టార్చర్ భరించలేక.. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బాగల్‌కోట్‌లోని (Bagalkot) ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.

Karnataka: రూ.2వేలు పెట్టిన చిచ్చు.. టీచర్ చేసిన పనికి విద్యార్థిని బలి

కర్ణాటకలో (Karnataka) హృదయాల్ని కదిలించే ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.2వేల కోసం ఓ టీచర్ పెట్టిన టార్చర్ భరించలేక.. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బాగల్‌కోట్‌లోని (Bagalkot) ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న జయశ్రీ మిశ్రికోటి (Jayashree Mishrikoti) ఇటీవల తన పర్సులో రూ.2వేలు కోల్పోయింది. అయితే.. ఆ డబ్బుల్ని నువ్వే దొంగలించావంటూ ఆ బాలికపై టీచర్ ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు ప్రధానోపాధ్యాయుడు కేహెచ్ ముజావర్ కూడా ఆ బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. నేరం రుజువైతే పాఠశాల నుంచి బహిష్కరిస్తామని కూడా బెదిరించారు.


దీంతో భయబ్రాంతులకు గురైన ఆ యువతి.. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంది. మార్చి 15వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అంత్యక్రియల తర్వాత బాధితురాలి సోదరి.. స్కూల్‌లో ఆ యువతికి ఎదురైన బాధాకరమైన పరిణామాలను తల్లిదండ్రులతో పంచుకుంది. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. స్కూల్‌లో జయశ్రీతో పాటు ముజావర్ తమ కుమార్తెను వేధించారని.. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. మార్చి 16న బాలిక మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా కేసుని పరిష్కరించి, బాలికకి తగిన న్యాయం అందిస్తామని చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 10:24 PM