Share News

Gold: నూతన పద్ధతిలో బంగారం అక్రమ తరలింపు

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:54 AM

నూతన పద్ధతిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి(Madurai International Airport)

Gold: నూతన పద్ధతిలో బంగారం అక్రమ తరలింపు

- స్వాధీనం చేసుకున్న అధికారులు

చెన్నై: నూతన పద్ధతిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి(Madurai International Airport) గురువారం రాత్రి వచ్చిన స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారు లు తనిఖీ చేపట్టారు. వారిలో ఒకరిని అనుమానించిన అధికారులు, అతనిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించినా ఏమీ లభించలేదు. అయినా అనుమానంతో అధికారులు అతని వస్తువులు పరిశీలించారు. వాటిలో సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పిన్నుల్లో బంగారం ఉండడం గుర్తించారు. ఈ ఘటనలో రూ.6,60,500 విలువైన 100 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని, రామనాథపురం జిల్లా దేవిపట్టణానికి చెందిన విజయ్‌ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

nani2.jpg

Updated Date - Mar 16 , 2024 | 10:54 AM