Share News

Hyderabad: మనీ లాండరింగ్‌ కేసు, డిజిటల్‌ అరెస్టు అంటూ రూ.3 కోట్లు కాజేశారు

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:25 AM

మనీలాండరింగ్‌ కేసుల పేరుతో ఓ వైద్యురాలిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఆమె నుంచి రూ.3 కోట్ల మేర కాజేశారు. నగరంలో నివసించే వైద్యురాలు (54)కు ఈనెల 14న ఓ వ్యక్తి ట్రాయ్‌ అధికారినని ఫోన్‌ చేశాడు. మీ మొబైల్‌ నంబర్‌తో పెద్దమొత్తం లో హవాలా డబ్బు తరలించారని ఆరోపించడమే కాకుండా రెండు గంటల్లో మీ సిమ్‌ బ్లాక్‌ చేస్తామని చెప్పాడు.

Hyderabad: మనీ లాండరింగ్‌ కేసు, డిజిటల్‌ అరెస్టు అంటూ రూ.3 కోట్లు కాజేశారు

- వైద్యురాలి నుంచి వసూలు చేసిన సైబర్‌ నేరగాళ్లు

- ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్న డబ్బు కూడా స్వాహా

హైదరాబాద్‌ సిటీ: మనీలాండరింగ్‌ కేసుల పేరుతో ఓ వైద్యురాలిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఆమె నుంచి రూ.3 కోట్ల మేర కాజేశారు. నగరంలో నివసించే వైద్యురాలు (54)కు ఈనెల 14న ఓ వ్యక్తి ట్రాయ్‌ అధికారినని ఫోన్‌ చేశాడు. మీ మొబైల్‌ నంబర్‌తో పెద్దమొత్తం లో హవాలా డబ్బు తరలించారని ఆరోపించడమే కాకుండా రెండు గంటల్లో మీ సిమ్‌ బ్లాక్‌ చేస్తామని చెప్పాడు. ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని వైద్యురాలు వివరణ ఇచ్చారు. కేసు గురించి సైబర్‌క్రైం అధికారితో మాట్లాడమని చెప్పి నంబర్‌ కలిపాడు. శశాంక్‌ జైన్‌ అనేవ్యక్తి తాను ఢిల్లీ ఐపీఎస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అప్పు తిరిగివ్వలేదని నిప్పు


స్కైప్‌ కాల్‌ చేసి, ఆమెపై నమోదైన కేసులు, విచారణ చేపట్టామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి(Supreme Court Judge) ఆదేశించినట్లుగా లేఖలు చూపాడు. ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ కావచ్చని చెప్పి భయపెట్టాడు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో 10 రోజులపాటు ఎవరితో కలవకుండా, మాట్లాడకుండా చేసి వేధించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బుతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నగదు మొత్తం రూ.3 కోట్ల వరకు బదిలీ చేయించుకున్నారు.


ఈనెల 24న ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు మీ డబ్బు ఆర్‌బీఐ ఖాతాల్లో(RBI accounts) సురక్షితంగా ఉందని, వెరిఫికేషన్‌ పూర్తిచేసి మూడు రోజుల్లో జమ చేస్తామని చెప్పారు. గడువు ముగిసినా డబ్బు ఖాతాలో జమ కాకపోవడం, ఫోన్‌ నంబర్లు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 08:25 AM