Lucknow Accident Video: అత్యంత దారుణం.. స్కూటర్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 23 , 2024 | 10:25 AM
లక్నోలోని పీజీఐ పోలీస్‌స్టేషన్ పరిధి లోని కిసాన్ పథ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ మీద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు డ్రైవర్ చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలో జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని పీజీఐ పోలీస్‌స్టేషన్ పరిధి లోని కిసాన్ పథ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు (Car) స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది (Road Accident). ఈ ఘటనలో స్కూటర్ (Scooter) మీద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు డ్రైవర్ చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Lucknow Accident Video).
@sanjayjourno అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కిసాన్ పథ్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వెళ్తున్న కారు స్కూటర్‌ని ఢీకొట్టింది. ఆ స్కూటీ మీద ఇద్దరు ప్రయాణిస్తున్నారు. కారు ఢీకొట్టగానే వారిద్దరూ ఎగిరి దూరంగా పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏమిటంటే.. యాక్సిడెంట్ తర్వాత ఆ బైక్.. కారు బానెట్ కింద చిక్కుకుపోయింది. ఆ స్కూటీని కారు డ్రైవర్ దాదాపు అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. స్కూటీ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నా ఆ కార్ డ్రైవర్ పట్టించుకోలేదు. చుట్టు పక్కల వారు కేకలు వేసినా ఆ కార్ డ్రైవర్ ఆగలేదు.
అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారాలు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..