Home » Lucknow
ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు విమానంలో బయలుదేరిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించడంతో పెలట్లు వెనక్కి మళ్లించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్‌పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.
మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్‌పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్‌పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.
బంధుమిత్రుల పలకరింపులు, మేళతాళాల మధ్య చిందులతో హడావుడిగా ఉన్న పెళ్లి పందిరిలోకి అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు..
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూ ఇయర్ వేళ ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలోని ఓ హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి వచ్చి చూడగా 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.
అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని ఆరోపించారు.
అక్రమ గ్యాస్ గోదాములో అనుకోకుండా భారీ పేలుడులో సంభవించింది. దీంతో నలుగురు కార్మికులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పోలీసుల కుమ్మక్కుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లక్నోలోని పీజీఐ పోలీస్‌స్టేషన్ పరిధి లోని కిసాన్ పథ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ మీద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ కారు డ్రైవర్ చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.